- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వాహనదారులు అలర్ట్.. ఇలా చేస్తే రూ.1000 ఫైన్ తప్పదు!
దిశ, డైనమిక్ బ్యూరో : వాహనం నడపడం వస్తే చాలు వాహనదారులు రోడ్డెక్కేసి తిరిగేస్తుంటారు. కానీ, వారు ట్రాఫిక్ రూల్స్ గురించి కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. రూల్స్ తెలియకుండా లైసెన్సు కూడా పొందలేరు. అయితే, ఏ రోడ్డుపై, ఏ వాహనం ఎంత స్పీడ్‌లో వెళ్లాలో మోటారు వాహన చట్టం స్పష్టంగా సూచిస్తోంది. ఎంవీ యాక్ట్ ప్రకారం సిటీలో బైకర్స్ గంటకు 60 కి.మీ స్పీడ్‌లో మాత్రమే వాహనాన్ని డ్రైవ్ చేయాలని ఉంది. ఈ వేగం వాహనాలను బట్టి మారుతుంది. అయితే, హైదరాబాద్ నగరానికి చెందిన ఓ వాహనదారుడు గతేడాది లంగర్‌హౌస్ 66 కి.మీ వెళ్లడంతో ఓవర్ స్పీడ్ కారణంగా అతడికి రూ.1000 ఫైన్ వేశారు.
అయితే, దీనిపై ఆ వాహనదారుడు ట్విట్టర్ వేదికగా.. హైదరాబాద్ పోలీసులను ప్రశ్నించగా.. సిటీలో గంటకు 40 కి.మీ స్పీడ్‌లో వెళ్లేందుకు మాత్రమే అనుమతి ఉందంటూ హైదరాబాద్ సిటీ పోలీసులు రీట్వీట్ చేశారు. వారి సమాధానంతో ఒక్కసారిగా కంగుతిన్న నెటిజన్లు.. ఎంవీ యాక్ట్‌కి సంబంధించిన వివరాలను పోస్ట్ చేస్తున్నారు. అయితే, దీనిపై సామాజిక కార్యకర్త విజయ్ గోపాల్ స్పందించారు. ఇలా ఇల్లీగల్‌గా స్పీడ్ లిమిట్ పేరుతో చలాన్లు విధించడం ఆపాలని కోరారు. సిటీలో గంటకు 60 కిమీ లిమిట్ ఉందని, ఒకవేళ తగ్గించినట్టైతే.. అది గెజిట్ ద్వారా జరగాలి అని ట్విట్టర్ వేదికగా.. పోలీస్ కమిషనర్‌కు, డీజీపీకి ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేశారు. దీంతో, గోపాల్ ట్వీట్‌కు నెటిజన్లు స్పందిస్తూ తమకూ ఇలాంటివి జరిగాయంటూ రీట్వీట్లు చేస్తున్నారు.