- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
వీళ్లు కొడుకులా..? ఆస్తి కోసం కన్నతల్లితో ఇలా ప్రవర్తిస్తారా..
by Sumithra |

X
దిశ, లింగాల : ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా లింగాల మండల కేంద్రంలోని బంజారా వీధిలో ఆస్తి కోసం కన్నతల్లిని ఇంట్లోంచి నిర్ధాక్షిణ్యంగా బయటకు గెంటివేశారు కన్న కొడుకులు. ఆ తర్వాత ఇంటికి తాళం వేసి గత వారం రోజులుగా మానసికంగా వేధిస్తున్నట్టు పాత్లావత్ బురాబాయి ఆవేదన వ్యక్తంచేశారు. పాత్లావత్ బురా బాయికి ఆరుగురు సంతానం. ఎవరిబతుకు వారు బతుకుతున్నారు. అయినా కూడా ఆమెను తన ఇద్దరు కుమారులు వేధిస్తున్నారు. ఈ విషయంపై న్యాయం కోసం గతంలో స్థానిక కుల పెద్దల దగ్గరికి వెళ్లి ఫిర్యాదు చేసినా ఎటువంటి ఫలితం లేకుండా పోయింది. అక్కడ న్యాయం జరగక పోయేసరికి బాధితురాలు స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సిఉంది.
Next Story