తల్లీకూతుళ్లు ఆత్మహత్య.. కారణం అదేనా ?

by Sridhar Babu |   ( Updated:2021-11-20 23:54:31.0  )
తల్లీకూతుళ్లు ఆత్మహత్య.. కారణం అదేనా ?
X

దిశ, మెట్‌పల్లి టౌన్ : కుటుంబ కలహాలతో తల్లీకూతుళ్లు ఆత్మహత్య చేసుకున్న ఘటన కరీంనగర్ జిల్లా మెట్‌పల్లిలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. జిల్లాలోని మెట్ పల్లి మండలంలోని ఆత్మనగర్‌లో నివాసం ఉంటున్న రామలచ్చక్క అనే మహిళ తన పిల్లలతో కలసి వరద కాలువలో పడి ఆత్మహత్య చేసుకుంది. గత కొన్ని రోజులుగా వారి కుటుంబ సభ్యులతో వాగ్వాదాలు జరుగుతున్నాయని, దీంతో మనస్థాపం చెందిన ఆమె తన కూతుళ్లు వనజ (28) శాన్వి(6)తో కలసి ఆత్మహత్యకు పాల్పడినట్టు తెలుస్తోంది. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానకి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. వార్తకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Next Story

Most Viewed