- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ప్రియుడి మోసం.. గోదావరిలో దూకిన తల్లీకూతుర్లు
దిశ, వెబ్‌డెస్క్: నిర్మల్ జిల్లా బాసరలో దారుణం చోటుచేసుకుంది. పెళ్లి చేసుకుంటానని చెప్పి ప్రియుడు మోసం చేయడంతో భరించలేక గురువారం తల్లి తన బిడ్డతో కలిసి గోదావరిలో దూకి ఆత్మహత్యాయత్నం చేసింది. అది గమనించిన కానిస్టేబుల్ వారిని రక్షించి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.వివరాల్లోకివెళితే.. ఇదివరకే పెళ్లయి భర్త నుంచి విడాకులు తీసుకున్న కార్తీక అనే మహిళ సురేశ్ అనే వ్యక్తిని ప్రేమించింది. అతడు కూడా పెళ్లి చేసుకుంటానని మాయమాటలు చెప్పి ఆమెను గర్భవతిని చేశాడు. తీరా పెళ్లి చేసుకోమని అడిగేసరికి మొహం చాటేసాడు. దీంతో మనస్తాపం చెందిన కార్తీక తన బిడ్డతో కలిసి గోదావరిలో దూకి ఆత్మహత్యయత్నం చేసింది. కానిస్టేబుల్ ఆమెను రక్షించి పీఎస్‌కు తీసుకెళ్లి వివరాలు సేకరించగా అసలు విషయం వెల్లడించింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు ప్రేమపేరుతో మోసం చేసిన నిందితుడు సురేష్‌ను అరెస్టు చేసినట్లు బాసర పోలీసులు తెలిపారు.