- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కొత్త కేసులన్నీ కంటైన్‌మెంట్ జోన్ల నుంచే
రాష్ట్రంలో మరో 27 పాజిటివ్, ఒకరి మృతి
దిశ, న్యూస్‌బ్యూరో: రాష్ట్రంలో కొత్తగా 27 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఒకరు మృతి చెందారు. నమోదైన కొత్త కేసులన్నీ కంటైన్‌మెంట్ జోన్లలోంచి వచ్చినవే. ఇందులో 13 జీహెచ్ఎంసీ పరిధిలో ఉండగా, పది గద్వాల జిల్లా పరిధిలోనివి. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 970కు చేరింది. మరోవైపు 58 మంది పేషెంట్లు చికిత్స అనంతరం కోలుకుని గురువారం డిశ్చార్జి అయ్యారు. దీంతో మొత్తం డిశ్చార్జి అయినవారి సంఖ్య 262కు చేరుకుంది. చివరకు 693 మంది యాక్టివ్ పాజిటివ్ పేషెంట్లు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఇందులో 99% మంది గాంధీ ఆసుపత్రిలోనే ఉన్నారని మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. కంటైన్‌మెంట్ జోన్లు మినహా మిగిలిన జిల్లాల నుంచి కొత్తగా కరోనా పాజిటివ్ కేసులేవీ రావడంలేదని, ఇకపైన క్రమంగా కొత్త కేసులు తగ్గుముఖం పడతాయని ధీమా వ్యక్తం చేశారు.
గచ్చిబౌలిలోని ఆసుపత్రి పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చిందని, అవసరమైన వైద్య వ్యవస్థ మొత్తం సిద్ధమైందని, అయితే మంచినీటి సరఫరా వ్యవస్థను సమకూర్చాల్సి ఉందని, ఇది కూడా నెల రోజుల్లో పూర్తవుతుందని తెలిపారు. ప్రైమరీ, సెకండరీ కాంటాక్టులతో పాటు పాజిటివ్ పేషెంట్లతో ఉన్న లింకు చివరి వరకూ గుర్తింపు ప్రక్రియ పూర్తయిందని, కేంద్ర వైద్యారోగ్య మంత్రిత్వశాఖ మార్గదర్శకాల మేరకే సెకండరీ కాంటాక్టులకు కరోనా నిర్ధారణ పరీక్షలు చేయవద్దని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. రాష్ట్రంలో కరోనా నిర్ధారణ పరీక్షలకు అవసరమైన కిట్లు సంతృప్తికరంగానే ఉన్నాయని, ప్రస్తుతం రాష్ట్రంలోని తొమ్మిది లేబొరేటరీల్లో పరీక్షల సామర్థ్యాన్ని పెంచే ఆలోచన ఉన్నదని అన్నారు.
జాతీయ గణాంకాలతో పోలిస్తే తెలంగాణ చాలా సంతృప్తికరమైన ఫలితాలను సాధిస్తోందని వివరాలను వెల్లడించారు. ప్రతీ ఏడున్నర రోజులకు ఒకసారి జాతీయ కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రెట్టింపు అవుతూ ఉంటే తెలంగాణలో మాత్రం పన్నెండు రోజులు పడుతోందని, రికవరీ కేసుల విషయంలో జాతీయ సగటు 19.9%గా ఉంటే తెలంగాణలో 22% ఉందని అన్నారు. కరోనా మరణాల విషయంలో జాతీయ సగటున 3.18%గా ఉంటే తెలంగాణలో 2.6% మాత్రమేనని వివరించారు. రాష్ట్రంలో పీపీఈ కిట్లు, ఎన్-95 మాస్కులు కూడా నాలుగున్నర లక్షల చొప్పున సిద్ధంగా ఉన్నాయని, కొరత లేదన్నారు. నల్లగొండ జిల్లాలో కరోనా ఆసుపత్రిని తీర్చిదిద్దే ఆలోచన లేదని మరో ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. అత్యవసర సేవలకు ప్రభుత్వ అంబులెన్స్‌లు అందుబాటులో లేకుంటే ప్రైవేటు అంబులెన్స్‌లను వినియోగించుకోవచ్చని తెలిపారు.
Tags: Telangana, Corona, Containment Zones, Positive, GHMC, Gadwal