ట్రెండింగ్‌లో 'మోస్ట్ ఎలిజబుల్ బ్యాచులర్' ఫస్ట్ సింగిల్

by Shyam |   ( Updated:2024-06-01 14:59:32.0  )
ట్రెండింగ్‌లో మోస్ట్ ఎలిజబుల్ బ్యాచులర్ ఫస్ట్ సింగిల్
X

అఖిల్… అక్కినేని వారసుడు. చైల్డ్ ఆర్టిస్ట్‌గా ‘సిసింద్రీ’ సినిమాతో ఆకట్టుకున్నా…. హీరోగా మాత్రం ఇప్పటి వరకు ఆడియన్స్‌ను మెప్పించలేకపోయాడు. ‘అఖిల్’ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన అఖిల్…. ఇప్పటి వరకు సరైన హిట్ అందుకోలేకపోయారు. ‘అఖిల్’ తర్వాత వచ్చిన ‘హలో’ మూవీకి సైతం యావరేజ్ టాక్ రాగా… నాగ్ కొడుకు కెరియర్‌ గురించి చాలా భయపడిపోయాడు. కనీసం తన హిట్ చిత్రం టైటిల్ పెడితే అయినా కలిసి వస్తుందేమో అని.. ‘మజ్ను’ చిత్ర టైటిల్‌తో కలిసి వచ్చేలా అఖిల్ మూడో సినిమా టైటిల్‌ను ‘మిస్టర్ మజ్ను’గా పెట్టి ప్రయోగం చేశారు. కానీ ఫలితం మాత్రం కలిసిరాలేదు.

దీంతో బాగా ఆలోచించి అఖిల్‌ను బొమ్మరిల్లు భాస్కర్ చేతిలో పెట్టారు నాగ్. ఆయన దర్శకత్వంలో వస్తున్న సినిమానే ‘మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్’. పూజా హెగ్డే హీరోయిన్ కాగా.. ఇప్పటికే వచ్చిన ఫస్ట్ లుక్ ఆకట్టుకుంది. పైగా గీతా ఆర్ట్స్ బ్యానర్‌లో సినిమా వస్తుంది కాబట్టి ఈ సారి అఖిల్ ఖచ్చితంగా హిట్ కొట్టే తీరుతాడని ధీమా వ్యక్తం చేస్తున్నారు అక్కినేని ఫ్యాన్స్. గోపీ సుందర్ సంగీతం అందించిన ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేశారు. ‘మనసా మనసా మనసారా బ్రతిమాలా… తన వలలో పడమాకే మనసా’ అంటూ సాగే మెలోడీ సాంగ్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. మోస్ట్ వాంటెడ్ సింగర్ సిద్ శ్రీరామ్ పాడిన ఈ పాట ప్రెజెంట్ ట్రెండింగ్‌లో ఉంది.

Advertisement

Next Story