రంజాన్ ప్రార్థనలపై మార్గదర్శకాలు విడుదల చేసిన సౌదీ అరేబియా

by vinod kumar |   ( Updated:2020-04-18 06:53:31.0  )
రంజాన్ ప్రార్థనలపై మార్గదర్శకాలు విడుదల చేసిన సౌదీ అరేబియా
X

రియాద్: కరోనా వైరస్ నేపథ్యంలో సౌదీ అరేబియా ప్రభుత్వం.. రంజాన్ ప్రార్థనలపై మార్గదర్శకాలు విడుదల చేసింది. లాక్‌డౌన్ కారణంగా మసీదులు ఏవీ తెరుచుబోవని.. ప్రజలందరూ తమ ఇండ్లలోనే ప్రార్థనలు చేసుకోవాలని సౌదీ అరేబియా మినిస్ట్రీ ఆఫ్ ఇస్లామిక్ అఫైర్స్ ఆదేశాలు జారీ చేసింది. ముస్లింలు రంజాన్ మాసంలో తారావీహ్ ప్రార్థనలను ఎంతో ముఖ్యమైనవిగా భావిస్తారు.. వాటిని కూడా ఈ ఏడాది మసీదుల్లో నిర్వహించడాన్ని నిషేధిస్తున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. కాగా, సౌదీ ప్రభుత్వ మార్గదర్శకాలను మతపెద్ద గ్రాండ్ ముఫ్తీ షేక్ అబ్దులాజీజ్ అల్ షేక్ సమర్థించారు. దేశంలోని ప్రజలందరూ ప్రస్తుత పరిస్థితుల్లో మసీదుకు వెళ్లలేరని.. కాబట్టి వాళ్లు తమ ఇండ్లలోనే ఇఫ్తార్, తారావీహ్ కార్యక్రమాలను నిర్వహించుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. అలాగే రంజాన్ రోజు మదీనాలోని మసీదులో ప్రతీరోజు ఏర్పాటు చేసే ఇఫ్తార్ విందును కూడా రద్దు చేస్తున్నట్లు అల్ షేక్ చెప్పారు. మార్చి రెండో వారం నుంచే ఈ నిబంధనలు అమలులోనికి వచ్చాయని.. ముస్లింలందరూ ఈ నియమాలను తప్పకుండా పాటించాలని.. కరోనా వైరస్ ఉధృతి కారణంగానే మసీదులు మూసేసిన విషయం గుర్తుంచుకోవాలని కోరారు.

tags: saudi arabia, ramadan month, religious, mosques, closed

Advertisement

Next Story