- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అక్టోబర్ పారిశ్రామికోత్పత్తి పెరిగే అవకాశం
దిశ, వెబ్‌డెస్క్: పండుగ సీజన్ నేపథ్యంలో కొంత మెరుగైన పరిస్థితులున్న కారణంగా అక్టోబర్‌లో భారత పారిశ్రామికోత్పత్తి 2.8 శాతం పెరిగే అవకాశాలున్నాయని మోర్గాన్ స్టాన్లీ పరిశోధన వెల్లడించింది. సెప్టెంబర్‌లో పారిశ్రామికోత్పత్తిలో 0.2 శాతం వృద్ధి నమోదు కాగా.. అక్టోబర్‌లో 2.8 శాతానికి పెరుగుతుందని ఆశిస్తున్నట్టు తెలిపింది. పండుగ సమయంలో డిమాండ్.. గతేడాది అక్టోబర్ స్థాయిలో నమోదవడంతో మెరుగైన పారిశ్రామికోత్పత్తి ఉండనుంది.
ముఖ్యంగా విద్యుత్ డిమాండ్, ఆటో అమ్మకాలు, ఈ-వే బిల్లులు, అక్టోబర్ నెలకు సంబంధించి జీఎస్టీ వసూళ్ల వృద్ధి నేపథ్యంలో పారిశ్రామికోత్పత్తి ఊపందుకుంటుందని నమ్ముతున్నట్టు మోర్గాన్ స్టాన్లీ నివేదిక వెల్లడించింది. ఇదే సమయంలో భారత జీడీపీ వృద్ధి రేటు వరుసగా రెండు త్రైమాసికాల్లో ప్రతికూలంగా నమోదైంది. సెప్టెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో జీడీపీ 7.5 శాతంగా ఉంది. అంతకుముందు త్రైమాసికంలో నమోదైన 23.9 శాతం ప్రతికూలతతో పోలిస్తే చాలా మెరుగ్గా ఉంది. ఈ పరిణామాలు భారత వృద్ధిపై నమ్మకాన్ని పెంచుతోందని, ఊహించిన దానికంటే వేగంగా పుంజుకోవడంతో పారిశ్రామికోత్పత్తి సానుకూలతపై నమ్మకముందని నివేదిక తెలిపింది.