- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
హెయిర్ లాస్ కూడా కొవిడ్ లక్షణమేనా?
దిశ, వెబ్‌డెస్క్ :
ఓ వైపు కొవిడ్ సోకినవారిలో కొత్త లక్షణాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. మరోవైపు.. ఈ మహమ్మారి నుంచి బయటపడ్డాక కూడా ఎన్నో సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నట్లు ఇప్పటికే చాలా మంది కరోనా బాధితులు వెల్లడిస్తున్నారు. అదేవిధంగా కొవిడ్ సోకినవారు ఆరోగ్యపరంగా దీర్ఘకాలికంగా కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుందని ఇప్పటికే కొన్ని అధ్యయనాలు తేల్చి చెప్పాయి. తాజాగా కరోనా బాధితుల్లో జుట్టు రాలడమనేది దీర్ఘకాలిక సమస్యగా మారినట్లు పరిశోధనల్లో తేలింది. హాలీవుడ్ నటి అలీసా మిలానో కూడా దీనిపై స్పందించారు. తన జుట్టు విపరీతంగా ఊడిపోతున్నట్లు సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది.
కరోనా కేసులు మొదలైన నాటి నుంచి వైద్య నిపుణులు, శాస్త్రవేత్తలు.. వైరస్ తీరుతెన్నులను అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. కానీ కరోనా.. అంతుచిక్కడం లేదు. జన్యువును మార్చుకోవడంతో పాటు అనేక లక్షణాలకు కేంద్రంగా మారింది. ‘ద సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్’ వారు కొవిడ్ 19 సింప్టమ్స్ లిస్టులో కొత్త కొత్త లక్షణాలను యాడ్ చేస్తూనే ఉన్నారు. తాజాగా హెయిర్ లాస్ కూడా ఆ జాబితాలో చేరనుంది.
‘ఇండియానా యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ మెడిసిన్’ ఇటీవల నిర్వహించిన ఒక అధ్యయనంలో జుట్టు రాలడాన్ని కరోనా వైరస్ దీర్ఘకాలిక లక్షణంగా గుర్తించారు. ఫేస్‌బుక్ పోల్ ద్వారా 1,500 మందికి పైగా రోగులను సర్వే చేసిన డాక్టర్లు.. 98 లక్షణాలను కనుగొన్నారు. వాటిల్లో జుట్టు రాలడం కూడా ఓ లక్షణంగా తేలింది. ఈ విషయంపై రీసెర్చ్ ప్రొఫెసర్ డాక్టర్ నటాలీ లాంబెర్ట్ మాట్లాడుతూ.. ‘తీవ్రమైన నరాల నొప్పి, ఏకాగ్రతను కోల్పోవడం, నిద్రపోవడంలో ఇబ్బంది, దృష్టి మసకబారడం, జుట్టు రాలడం వంటి కొత్త లక్షణాలను మేము చేసిన తాజా అధ్యయనంలో గుర్తించాం’ అని అన్నారు. అంతేకాకుండా సర్వే పోల్‌లో పాల్గొన్నవారిలో దాదాపు మూడో వంతు మంది జుట్టు రాలడాన్ని వైరస్ లక్షణం అని తేల్చి చెప్పారు. సాధారణంగా ‘మేజర్ సర్జరీ, హై ఫీవర్, ఎక్స్‌ట్రీమ్ వెయిట్ లాస్, చేంజ్ ఇన్ డైట్’ వంటి సమయాల్లో హెయిర్ లాస్ జరుగుతుందని, కరోనా విషయంలోనూ ఇలానే జరుగుతుందని వైద్యులు అభిప్రాయపడ్డారు. ఈ క్రమంలోనే.. ‘నా క్లినిక్‌లోని కొంతమంది పేషేంట్లలో కూడా హెయిర్ లాస్ నేను అబ్జర్వ్ చేశాను. కానీ ఎక్కువ మందిలో ఈ లక్షణం కనిపించడం లేదు’ అని కెనడియన్ హెయిర్ లాస్ ఫౌండేషన్ ప్రెసిడెంట్ జెఫ్ డోనోవన్ అన్నారు.
హాలీవుడ్ నటి అలీసా మిలానో తాను కరోనా బారినపడటం వల్ల జుట్టు ఊడిపోయిందని వివరిస్తూ సోషల్ మీడియా వేదికగా ఓ వీడియోను షేర్ చేసింది. ‘ఏప్రిల్ నెల నుంచి నాకు ఈ సమస్య మొదలైంది. కొవిడ్ నుంచి కోలుకున్నాక కూడా ఎన్నో లక్షణాలు ఇంకా నాలో కనిపిస్తున్నాయి. అప్పుడప్పుడు చెస్ట్ పెయిన్ కూడా వస్తుంది. కొవిడ్ వల్ల మన హెయిర్ చాలా ఊడిపోతోంది. మీరు జాగ్రత్తగా ఉండండి’ అని ఆమె పేర్కొన్నారు.