మారనున్న మూసీ నది స్వరూపం

by Shyam |
మారనున్న మూసీ నది స్వరూపం
X

దిశ, న్యూస్‌బ్యూరో: మూసీనదిని సుందరంగా తీర్చిదిద్దే పనులు ప్రారంభయ్యాయని మూసీ రివర్​ఫ్రంట్​ డెవలప్​మెంట్​ కార్పొరేషన్​ లిమిటెడ్​​(ఎంఆర్​డిసిఎల్​) ఛైర్మన్​ దేవిరెడ్డి సుధీర్​రెడ్డి అన్నారు. గండిపేట వెల్ఫేర్​ సొసైటీ ఆధ్వర్యంలో గండిపేట వద్ద ‘మూసీ రివర్​ క్లీన్​ అప్​‌‌–2020’ కార్యక్రమాన్ని రాజేంద్రనగర్​ ఎమ్మెల్యే ప్రకాశ్​గౌడ్​తో కలిసి ఆయన శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన సుధీర్‌రెడ్డి మాట్లాడుతూ మూసీ నది శుద్ధిచేసే పనులను శరవేగంగా పూర్తిచేసేందుకు ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందన్నారు. వచ్చే వర్షాకాలం సీజన్​లో మూసీ నదిలో దోమల వ్యాప్తిని నిరోధించేందుకు ప్రత్యేకంగా దృష్టిసారించామని తెలిపారు. బాపూఘాట్​ నుంచి నాగోల్​ బ్రిడ్జి వరకు డ్రోన్ల సహాయంతో యాంటి లార్వా స్రే చేసి, దోమల నిర్మూలన చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. మూసీ సుందరీకరణ పనుల్లో భాగస్వామ్యమయ్యేందుకు ముందుకొచ్చిన గండిపేట వెల్ఫేర్​ సొసైటీ సభ్యులను ఛైర్మన్​ సుధీర్​రెడ్డి అభినందించారు. ఈ కార్యక్రమంలో హెచ్ఎండీఏ చీఫ్​ ఇంజినీర్​ బిఎల్​ఎన్​.రెడ్డి, ఎంఆర్‌డీసీఎల్​ అధికారులు పాల్గొన్నారు.

Advertisement

Next Story