- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
టీఎన్జీవో ఫోరం అధ్యక్షుడిగా మొయినుద్దీన్

దిశ, హైదరాబాద్: టీఎన్జీవో వసతి గృహ సంక్షేమ అధికారుల ఫోరం అధ్యక్షుడిగా ఎండీ ఖాజా గౌస్ మొయినుద్దీన్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ మేరకు బుధవారం నాంపల్లిలోని కార్యాలయంలో జరిగిన సమావేశంలో టీఎన్జీవో రాష్ట్ర అధ్యక్షుడు కారం రవీందర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి ఎం. రాజేందర్‌లు నూతన కార్యవర్గం వివరాలను ప్రకటించారు. ఫోరం అధ్యక్షుడుగా ఎండీ. ఖాజా గౌస్ మొయినుద్దీన్, కార్యదర్శిగా బి.మాధవ్ గౌడ్, సహా అధ్యక్షుడిగా లక్ష్మణ్ , కోశాధికారిగా యస్.పి.సుదర్శన్ స్వామి ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా కేంద్ర సంఘం అధ్యక్షుడు శ్రీకారం రవీందర్ రెడ్డి మాట్లాడుతూ.. జూన్ నెల వేతనం పూర్తిగా చెల్లించాలని, మార్చి, ఏప్రిల్, మే నెల రిజర్వు చేసిన ఉద్యోగుల వేతనాలను వెంటనే చెల్లించాలని ప్రభుత్వాన్ని కోరినట్లు తెలిపారు. అనంతరం రాష్ట్ర వసతి గృహ సంక్షేమ అధికారుల ఫోరం మాజీ అధ్యక్షుడు టి.రామారావుకు నివాళులు అర్పించారు.