మోహన్ బాబు వంట.. యమ టేస్టీ అంట..

by Shyam |
మోహన్ బాబు వంట.. యమ టేస్టీ అంట..
X

కలెక్షన్ కింగ్ మోహన్ బాబు.. తన డైలాగ్ డెలివరీతో ప్రేక్షకులను మెప్పించాడు. ఆయన డైలాగ్ చెప్తుంటే సీనియర్ ఎన్టీఆర్ గుర్తొస్తాడు అని కొందరు అంటే… ఆయన చెప్పే డైలాగ్ కు రోమాలు నిక్కబొడుచుకుంటాయని మరికొందరు చెబుతుంటారు. ఏ పాత్ర ఇచ్చినా సరే.. అవలీలగా ఆ పాత్రలోకి పరకాయ ప్రవేశం చేసి ప్రేక్షకులను మంత్రుగ్ధులను చేయగలడు. అయితే… తనలో మరో కోణం దాగి ఉందని ఈ మధ్యే తెలిసింది. టి. సుబ్బిరామి రెడ్డి కూతురు పింకీ రెడ్డి విసిరిన చాలెంజ్ తో … మోహన్ బాబు గరిట తిప్పడంలోనూ నేర్పరి అని అభిమానులకు తెలిసిపోయింది.

అయితే తాజాగా పాక శాస్త్రం లో సరికొత్త ప్రయోగం చేశాడు మోహన్ బాబు. థాయ్, ఇండియన్ ఫ్లేవర్స్ మిక్స్ చేసి ఓ సరికొత్త వంటకం చేశాడు. దీనికి ఖీమా స్టిక్కీ ఫ్రైడ్ రైస్ అని పేరు కూడా పెట్టాడు. భార్య, కూతురు మంచు లక్ష్మీ ప్రసన్న సమక్షంలో చేసిన ఈ వంటకం యమ్మీగా ఉందంటూ పోస్ట్ పెట్టింది లక్ష్మీ. మరి మోహన్ బాబు తయారు చేసిన ఈ వంటకం మీకూ నచ్చితే ఫాలో అయిపొండి.


Tags: Mohan Babu, Lakshmi Prasanna, Tollywood, Kitchen, Recipe

Advertisement

Next Story