జగన్‌‌కు ఫోన్ చేసిన ప్రధాని మోదీ

by Anukaran |
జగన్‌‌కు ఫోన్ చేసిన ప్రధాని మోదీ
X

దిశ ఏపీ బ్యూరో: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ప్రధాని నరేంద్ర మోదీ ఫోన్ చేశారు. కరోనా వైరస్ విజృంభణ నేపథ్యంలో ఆయన ఫోన్ చేశారు. రాష్ట్రంలో చేపడుతున్న చర్యలు, కేసుల వివరాలు, వ్యాప్తి వేగం, నివారణ చర్యలు, టెస్టుల తీరు అడిగి తెలుసుకున్నారు. వైరస్ నివారణకు చేపట్టాల్సిన చర్యలను వివరించారు. అలాగే పలు సూచనలు చేసి సలహాలు ఇచ్చారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన చర్యలను ప్రధానికి వివరించారు. దీనికి పీఎం స్పందిస్తూ, కరోనా వ్యాపిస్తున్న క్లిష్టపరిస్థితుల్లో రాష్ట్రాలకు అండగా కేంద్రం ఉంటుందని పేర్కొన్నారు. రికార్డు స్థాయిలో పరీక్షలు నిర్వహిస్తున్న రాష్ట్ర ప్రభుత్వాన్ని అభినందించారు.

Advertisement

Next Story