పద్మ అవార్డులు ఎవరికివ్వాలి..? ఇక ప్రజలే సూచించవచ్చు

by Shamantha N |   ( Updated:2021-07-11 06:58:42.0  )
Prime Minister Modi to attend G7 summit
X

దిశ, వెబ్‌డెస్క్: పద్మ అవార్డులకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అవార్డులు ఎవరికి ఇవ్వాలో ప్రజలకే నిర్ణయించే అవకాశం కల్పించింది. పద్మ అవార్డులకు ప్రజలే పేర్లను నామినేట్ చేయాలని ప్రధాని మోదీ సూచించారు. ఈ మేరకు ట్విట్టర్‌లో పోస్ట్ పెట్టారు. padmaawards.gov.in వెబ్‌సైట్‌లోకి వెళ్లి నామినేట్ చేయవచ్చని మోదీ తెలిపారు.

సెప్టెంబర్ 15లోపు పేర్లను తెలపాలని సూచించారు. పీపుల్ పద్మ అంటూ హాష్ ట్యాగ్ తో పేర్లను నామినేట్ చేయాలని చెప్పారు. ప్రతిసారి రాష్ట్ర ప్రభుత్వాలు కొన్ని పేర్లను కేంద్ర ప్రభుత్వానికి పంపిస్తాయి. వారిలో కొంతమంది పేర్లను కేంద్రం పద్మ అవార్డుల కోసం ఎంపిక చేస్తుంది. కానీ ఈ సారి ప్రజలే నామినేట్ చేసే అవకాశాన్ని మోదీ ప్రభుత్వం కల్పించింది.


👉 Follow us on WhatsApp Channel
👉 Follow us on Sharechat


Next Story