- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రియల్ లైఫ్ నోవా
దిశ, వెబ్‌డెస్క్: క్రైస్తవ మత గ్రంథాల్లో నోవాస్ ఆర్క్ అని కథ ఉంటుంది. అందులో ప్రపంచమొత్తం ప్రళయం వచ్చి నాశనమైపోతుందని తెలిసి అడవి జంతువులను కాపాడటానికి నోవా కష్టపడి ఒక పెద్ద ఆర్క్ (పడవ)ను తయారుచేస్తాడు. పెద్ద తుఫానును తట్టుకునేలా ఆ పడవను నిర్మించి సృష్టిలో ఉన్న అన్ని జంతువులను అందులోకి ఆహ్వానిస్తాడు. ఇప్పుడు నోవా కథ ఎందుకు గుర్తొచ్చిందంటే..మెక్సికోకు చెందిన రికార్డో పిమెంటల్ అనే వ్యక్తి ఆధునిక కాలపు నోవా అని ఇప్పుడు పొగడ్తలు అందుకుంటున్నాడు. జంతుజాలం పట్ల ఆయన చూపించిన కరుణను, ఉదాత్త స్వభావం గురించి తెలిస్తే మీరు కూడా అంగీకరిస్తారు. ఇంతకీ పిమెంటల్ ఏం చేశాడంటే..
తుఫానులు, వరదలు, భూకంపాలు లాంటి ప్రకృతి వైపరీత్యాలు సంభవించినపుడు మనుషులు వారి వారి ఇళ్లలో తల దాచుకుంటారు. కానీ, జంతువులకు ఆ సౌకర్యం ఉండదు. ముఖ్యంగా వీధి కుక్కలు, పిల్లులు జనావాసాల మధ్య పెరిగే జంతువుల పరిస్థితి దయనీయంగా మారుతుంది. వాటికి సేవ చేయాలంటూ, సాయం చేయాలంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టే వాళ్లందరూ సరిగ్గా సాయం చేయాల్సి వచ్చే సమయానికి చేతులెత్తేస్తారు. కానీ, పిమెంటల్ అలా చేయలేదు. చిన్నప్పటి నుంచి జంతువులు అంటే మక్కువ ఎక్కువ గల ఆయన, ఇటీవల భయంకరమైన హరికేన్ డెల్టా మెక్సికోను అతలాకుతలం చేసినపుడు వందల సంఖ్య జంతువులకు తాను ఉండే ఇంట్లో ఆశ్రయం కల్పించాడు.
ఇప్పుడు వాళ్లింటికి వెళ్లి చూస్తే, హాల్లో 40కి పైగా కుక్కలు, కుమారుడి గదిలో పిల్లులు, కుమార్తె గదిలో కోళ్లు, కుందేళ్లు, గొర్రెలు ఉండటం చూడవచ్చు. ఇవన్నీ ఇంటిని గలీజు చేస్తున్నాయి, అయినా కూడా వాటిని హరికేన్ డెల్టా నుంచి కాపాడిన సంతృప్తి ఎప్పటికీ నిలిచి ఉంటుందని పిమెంటల్ అన్నారు. అక్టోబర్ 6న జంతువుల కోసం చిన్న ప్రదేశాన్ని పిమెంటల్ నిర్మించాడు. దాన్ని పెద్ద ఎత్తున అభివృద్ధి చేయడానికి డొనేషన్‌లు కావాలని ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశాడు. తన ఇంట్లో వందల సంఖ్యలో జంతువులు ఉన్న ఫొటోలను చూసి పెద్ద ఎత్తున విరాళాలు వస్తున్నాయని, ఆ డబ్బుతో ఈ కాపాడిన జంతువులకు షెల్టర్ కూడా ఏర్పాటు చేస్తానని పిమెంటల్ చెప్పాడు. ఏదేమైనా జంతువుల పట్ల ప్రేమ గురించి పోస్టులు పెట్టడం చాలా సులభం. కానీ, వాటిని నిజంగా కాపాడటం గొప్ప అంటూ, పిమెంటల్ ఆధునిక కాలపు నోవా అంటూ నెటిజన్లు కీర్తిస్తున్నారు.