- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
ట్రాక్టర్ ధరలు పెంచిన మహీంద్రా
by Harish |

X
దిశ, వెబ్‌డెస్క్: కొవిడ్-19 మహమ్మారి వల్ల దెబ్బతిన్న వాహన పరిశ్రమ నష్టాలను పూడ్చుకోవడానికి, అలాగే ఉత్పత్తి వ్యయం పెరగడంతో ఇప్పటికే పలు కంపెనీలు ధరల పెంపును ప్రకటించాయి. తాజాగా, ఇన్‌పుట్ వ్యయాల పెరుగుదల ప్రభావాన్ని పాక్షికంగా పూడ్చుకునేందుకు జనవరి నెల నుంచి ట్రాక్టర్ల ధరలను పెంచనున్నట్టు మహీంద్రా అండ్ మహీంద్రా(ఎంఅండ్ఎం) సోమవారం తెలిపింది. పెరిగిన ధరలు 2021, జనవరి 1 నుంచి అమల్లోకి వస్తాయని, ఇది అన్ని మోడళ్లకు వర్తిస్తుందని కంపెనీ రెగ్యులేటరీ ఫైలింగ్‌లో పేర్కొంది. వస్తువుల ధరల పెరుగుదలతో పాటు ఇతర ఇన్‌పుట్ ఖర్చుల కారణంగానే ధరల పెంపు అవసరమని భావించినట్టు ఎంఅండ్ఎం ఓ ప్రకటనలో వెల్లడించింది. మరికొద్ది రోజుల్లో వేర్వేరు మోడళ్లలో ధరల పెరుగుదల వివరాలను తెలియజేయనున్నట్టు ప్రకటించింది.
Next Story