- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఎలక్ట్రిక్ వాహనాల విభాగంలో మహీంద్రా రూ. 3,000 కోట్ల పెట్టుబడి
దిశ, వెబ్‌డెస్క్: దేశీయ అతిపెద్ద వాహన తయారీ సంస్థ మహీంద్రా అండ్ మహీంద్రా(ఎంఅండ్ఎం) రాబోయే మూడేళ్లలో తన ఎలక్ట్రిక్ వాహనాల విభాగంలో రూ. 3,000 కోట్ల కొత్త పెట్టుబడులు పెట్టనున్నట్టు వెల్లడించింది. అలాగే, రానున్న రోజుల్లో మరిన్ని భాగస్వామ్యాల కోసం ప్రయత్నిస్తున్నట్టు తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా కంపెనీ కార్యకలాపాల సామర్థ్యాలను ఎలక్ట్రిక్ వాహనాల(ఈవీ) ప్లాట్‌ఫామ్‌లో అభివృద్ధికి వినియోగించనున్నట్టు పేర్కొంది. గతంలో ప్రకటించిన ప్రణాళికలకు అదనంగా ఈ రూ. 3 వేల కోట్ల పెట్టుబడులు పెట్టబోతున్నామని మహీంద్రా గ్రూప్ మేనేజింగ్ డైరెక్టర్, సీఈఓ అనీష్ షా చెప్పారు.
అదేవిధంగా రాబోయే ఐదేళ్లలో ఆటో, వ్యవసాయ రంగాల్లో రూ. 9,000 కోట్ల పెట్టుబడులను పెడుతున్నట్టు కంపెనీ ఓ ప్రకటనలో స్పష్టం చేసింది. 2025 నాటికి 5 లక్షల ఎలక్ట్రిక్ వాహనాలను భారత రోడ్లపై ఉంచాలని లక్ష్యంగా ఉన్నట్టు, దీనికోసం ఇప్పటికే ఈవీ విభాగంలో రూ. 1,700 కోట్లను, అదనంగా మరో రూ. 500 కోట్లతో కొత్త పరిశోధనా, అభివృద్ధి(ఆర్అండ్‌డీ) సెంటర్ కోసం పెట్టుబడులు పెట్టినట్టు కంపెనీ వివరించింది. ఇప్పటికే బ్యాటరీ ప్యాక్, పవర్ ఎలక్ట్రానిక్స్, మోటార్లను ఉత్పత్తి చేస్తున్న బెంగళూరులోని ప్లాంట్‌లో ఎలక్ట్రిక్ టెక్నాలజీ ప్లాంట్‌ను తెరిచినప్పటికీ కంపెనీకే చెందిన చకన్ ప్లాంట్‌లో ఎలక్ట్రిక్ వాహనాల తయారీకి కంపెనీ పెట్టుబడులు పెడుతోంది.