- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
బండి సంజయ్ ఖబర్దార్.. కేసీఆర్ ని టార్గెట్ చేస్తే ఊరుకోము.. ఎమ్మెల్సీ పురాణం సతీష్ ధ్వజం
దిశ, తెలంగాణ బ్యూరో:మత విద్వేషాలు రెచ్చగొట్టాలని చూస్తే బండి సంజయ్ జైలుకు పోతావు అని ఎమ్మెల్సీ పురాణం సతీష్ కుమార్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. శనివారం టీఆర్ఎస్ఎల్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. బండి సంజయ్ పాదయాత్రతో వచ్చిన రెండు సీట్లు కూడా పోతాయని జోస్యం చెప్పారు. పాలకుడు శక్తివంతుడు అయితే ద్రోహులు అంతా కలుస్తారని చాణిక్యుడు చెప్పిన అంశాన్ని వెల్లడించారు. బీజేపీని తెలంగాణ ప్రజలు ఆదరించారని, ప్రతిపక్షాలు విరామసమయంలో రాజకీయం చేసే నైజమని ధ్వజ మెత్తారు. బండి సంజయ్ ఖబర్దార్ కేసీఆర్ ను టార్గెట్ చేస్తే ఊరుకోమని హెచ్చరించారు. మోడీ దేశం కోసం కాదు తాబేదార్ల కోసం పని చేస్తున్నారని ఆరోపించారు.
కేసీఆర్ జైలుకు వెళ్లేంత నేరం ఏం చేశాడు అని ప్రశ్నించారు. బీజేపీ, టీఆర్ఎస్ పై విమర్శలు చేయడం ఆపి, ప్రజలకు ఏం చేస్తుందో చెప్పాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ మోడీని కలిస్తే తప్పా అని ప్రశ్నించారు. తెలంగాణ అభివృద్ధి కోసం ప్రధాని మోడీని కలిస్తే బీజేపీ నేతలు గజగజ వణుకుతూ ఉన్నారని పేర్కొన్నారు. ఆంధ్ర నాయకుల కబంద హస్తాల నుంచి తెలంగాణ ప్రజలను రక్షించే నేత కేసీఆర్ అని పేర్కొన్నారు. కేసీఆర్ ను టార్గెట్ గా మార్చి పాదయాత్ర చేస్తే బాగుండదు అని హెచ్చరించారు. కేసీఆర్ ను విమర్శించడానికే బండి సంజయ్ పాదయాత్ర చేస్తున్నాడని మండిపడ్డారు. తెలంగాణకు వచ్చి మహారాష్ట్ర మాజీ సీఎం ఫడ్నవీస్ పచ్చి అబద్ధాలు చెబుతున్నారని ఆరోపించారు. కేసీఆర్ కుటుంబ సభ్యులు దొంగ దారిలో కేబినెట్లో స్థానం పొందలేదని గుర్తుంచుకోవాలని అన్నారు.