- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
హైదరాబాద్ తరువాత జగిత్యాలదే రికార్డు
దిశ ప్రతినిధి, కరీంనగర్: డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణంలో హైదరాబాద్ తరువాత జగిత్యాల జిల్లా రికార్డు సాధించిందని ఎమ్మెల్సీ కవిత అన్నారు. మంగళవారం జగిత్యాల జిల్లా మల్యాల మండలం నూకపల్లిలో నిర్మాణంలో ఇళ్లను ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ… హైదరాబాద్ తరువాత ఒకే చోట మరో 4 వేల డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణం చేపట్టిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. పేదవారి సొంతింటి కలను నెరవేర్చుతున్నామని, గత ప్రభుత్వాలు ఇచ్చిన హామీలకు కేసీఆర్ నిర్మించిన ఇళ్లకు తేడా ప్రజలు గమనిస్తున్నారని తెలిపారు.
‘‘నూకపల్లిలో జరుగుతున్న ఇళ్ల నిర్మాణలు చూస్తే కేసీఆర్ గారు సంతోష పడతారని, వచ్చే సంవత్సరం జూన్‌లోగా ఈ ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేసి పేదవారి సొంతింటి కలను నెరవేరుస్తాం’’ అని ప్రకటించారు. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ వీటి నిర్మాణలపై ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ త్వరితగతిన పూర్తయ్యేలా పర్యవేక్షిస్తున్నారని అభినందించారు. జగిత్యాల అభివృద్ధికి తనవంతు సహకారం ఎప్పుడూ ఉంటుందని, టీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన హామీని నెరవేర్చుతున్నామని అన్నారు. ఇచ్చినమాట ప్రకారం.. జిల్లాకు మెడికల్ కళాశాల మంజూరు చేశారని కవిత గుర్తు చేశారు. జిల్లాలో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి కోసం సీఎంతో మాట్లాడుతానని ప్రకటించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు సంజయ్ కుమార్, రవిశంకర్, జిల్లా కలెక్టర్ రవినాయక్, మున్సిపల్ చైర్ పర్సన్ భోగశ్రావణిలు పాల్గొన్నారు.