ఫ్లాష్.. ఫ్లాష్.. తెలంగాణలో ముగిసిన ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్

by Anukaran |
ఫ్లాష్.. ఫ్లాష్.. తెలంగాణలో ముగిసిన ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల పోలింగ్ ముగిసింది. రాష్ట్ర వ్యాప్తంగా 6 స్థానాలకు ఉదయం 8 గంటలకు మొదలైన పోలింగ్ ప్రక్రియ సాయంత్రం 4 గంటల వరకు కొనసాగింది. నల్లగొండ, మెదక్, కరీంనగర్, ఆదిలాబాద్, ఖమ్మం జిల్లా స్థానిక సంస్థలకు ఈ పోలింగ్ జరిగింది. ఈ క్రమంలోనే ఎమ్మెల్యేలు, జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, కౌన్సిలర్లు తమ తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.

ఈ ఎన్నికల బరిలో టీఆర్ఎస్‌తో పాటు, కాంగ్రెస్, ఇండిపెండెంట్ అభ్యర్థులు ఉన్నారు. శుక్రవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. అక్కడక్కడ చెదురుముదురు ఘటనలు చోటుచేసుకున్నాయి. ఇక ఈ ఎన్నికల ఫలితాలు డిసెంబర్ 14న వెలువడనున్నాయి. వాస్తవానికి టీఆర్ఎస్‌కు ఓటర్ల సంఖ్య అధికంగా ఉన్నప్పటికీ.. పలువురు నేతలు ఇండిపెండెంట్ క్యాండిడేట్‌ల వైపు మొగ్గుచూపుతున్నట్టు వార్తలు రావడంతో విజేత ఎవరనేది రాష్ట్ర వ్యాప్తంగా ఉత్కంఠను రేపుతోంది.

Advertisement

Next Story

Most Viewed