కవితకు 80% టార్గెట్

by Anukaran |
కవితకు 80% టార్గెట్
X

దిశ ప్రతినిధి,నిజామాబాద్: నిజామాబాద్ స్థానిక సంస్థల శాసన మండలి సభ్యుల ఉప ఎన్నికలో తలపడిన అభ్యర్థుల భవితవ్యం బ్యాలెట్ బాక్సుల్లో నిక్షిప్తమైంది. ఎంపీ ఎన్నికలలో ఓటమి తరువాత ఈ ఎమ్మెల్సీ ఉపఎన్నికలో గెలవడం కల్వకుంట్ల కవితకు అవసరం కాగా, తొలిసారి ప్రత్యక్ష ఎన్నికలలో పోటీ చేస్తున్న పోతనకర్ లక్ష్మీనారాయణ, వడ్డేపల్లి సుభాష్‌రెడ్డిల రాజకీయ భవితవ్యంను ఫలితాలు నిర్ణయించనున్నాయి.

ఉమ్మడి జిల్లాలో ఎమ్మెల్సీ ఎన్నిక ప్రశాంతంగా ముగిసింది. బ్యాలెట్ ఓటింగ్ పద్ధతిలో జరిగిన పోలింగ్‌లో ఉమ్మడి జిల్లాలో 824 మందికి గాను 821 ఓట్లు పోలయ్యాయి. ఉమ్మడి జిల్లాలో 99.64 శాతం ఓటింగ్ నమోదైంది. ముగ్గురు మాత్రమే ఓటు హక్కును వినియోగించుకోలేదు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో 50 పోలింగ్ కేంద్రాల బ్యాలెట్ బాక్స్‌లను ఎన్నికల అధికారులు జిల్లా కేంద్రంలోని పాలిటెక్నిక్ కళాశాలలో భద్రపరిచారు. ఈ ఎన్నికలలో టీఆర్ఎస్ తరుపున మాజీ ఎంపీ కవిత, కాంగ్రెస్ నుంచి వడ్డేపల్లి సుభాశ్‌రెడ్డి, బీజేపి నుంచి పోతన కర్ లక్ష్మీనారాయణలు బరిలో నిలిచారు.

నిజామాబాద్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికల రిజల్ట్‌తో అభ్యర్థుల భవితవ్యం మరి కొన్ని గంటల్లో తెలనున్నది. ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ వరకు నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో టీఆర్ఎస్ కు 506 మంది ఓటర్లు ఉండగా కాంగ్రెస్‌కు 141, బీజేపీకి 85 ఓట్లతో పాటు ఇండిపెండెట్లు 76, ఎంఐఎం 28 ఓట్లు ఉన్నాయి. అధికార పార్టీ ఆఫరేషన్ ఆకర్ష్ చేపట్టి పెద్ధ సంఖ్యంలో ఇతర పార్టీల అభ్యర్థులను చేర్చుకుంది. దానికి తోడు ఎక్స్అఫీషియో హోదాలో స్పీకర్, మంత్రి, ఏడుగురు ఎమ్మెల్యేలు, ముగ్గరు ఎమ్మెల్సీ, ఇద్దరు ఎంపీలు ఓటు హక్కును వినియోగించుకున్నారు.

2 రౌండ్లు 835 ఓట్లు…

నిజామాబాద్ శాసన మండలి ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు సోమవారం నిర్వహించనున్నారు. ఎన్నికలు పూర్తి కాగానే అధికారులు కౌంటింగ్‌కు ఏర్పాట్లు చేస్తున్నారు. నిజామాబాద్ ప్రభుత్వ పాలిటెక్నిక్ మైదానంలో కౌంటింగ్ కేంద్రాన్ని ఎర్పాటు చేశారు. ఉమ్మడి జిల్లాలో 821 తో పాటు 14 మంది ఎక్స్అఫిషియో ఓటర్లు తమ ఓటు హక్కులను బ్యాలెట్ పద్ధతిలో సద్వినియోగం చేసుకున్నారు. మొత్తం 835 ఓట్లును రెండు రౌండ్స్‌లో పూర్తి చేస్తారు. ఒక రౌండ్‌లో 600 ఓట్లను, రెండో రౌండ్ లో మిగిలిన 221 ఓటర్లతో ఓట్లతో పాటు ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు 14 ఓట్లను లెక్కించనున్నారు. సొమవారం ఉదయం గంటల నుంచే కౌంటింగ్ మొదలవనుంది. దాదాపు కౌటింగ్ ప్రారంభించిన రెండు గంటల్లోనే ఫలితాలు వెలువడనున్నాయి.

అధికార పార్టీలో ధీమా..

నిజామాబాద్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికల లో అధికార టీఆర్ఎస్ నాయకులు గెలుపు ధీమాలో ఉన్నారు. నోటిఫికేషన్ నాటికే మెజార్టీ ఓటర్లు అపార్టీకి ఉండటంతో తమ అభ్యర్థి కల్వకుంట్ల కవిత గెలుపు కన్‌ఫార్మ్ అయింది. టీఆర్ఎస్‌కు 506 ఓట్లు ఉండగా, ఇటీవల టీఆర్ఎస్‌లో 100 మంది రెండు ప్రతిపక్ష పార్టీల ప్రజాప్రతినిధులు చేరడంతో 606 పైగా ఓట్లు వస్తాయని అంచనా వేస్తున్నారు. టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి కవితకు 80 శాతం ఓట్లు టార్గెట్ అని కనీసం 700 వరకు వస్తాయని టీఆర్ఎస్ వర్గాలు లెక్కలు వేస్తున్నారు.

500 మోజార్టీ వరకు వస్తుందని టీఆర్ఎస్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. కాంగ్రెస్ ఎన్నికల ప్రచారంలో వెనుకబడటంతో పాటు ఎక్కువ సంఖ్యలో ఆ పార్టీ ఓటర్లు చేజారడంతో ఎన్ని ఓట్లు వస్తాయో కనీసం అంచనాకు రాలేకుపోతున్నారు. ఇక బీజేపీ పార్టీ చేతులు కాలీన తరువాత ఆకుల పట్టుకున్న చందంగా పార్టీ ఓటర్లు ఒక్కోక్కరు పార్టీ వీడుతున్నా పట్టించుకోలేదు. నెమ్మదిగా తేరుకుని క్యాంపుకు తరలించి క్యాడర్‌ను నిలుపుకోవాడానికి ప్రయత్నం చేశారు.

ఫలితాలపై పందేల జోరు..

నిజామాబాద్ లోకల్ బాడీ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ఫలితాలపై భారీగా బెట్టింగ్ కాస్తున్నట్లు తెలిసింది. అధికార పార్టీ అభ్యర్థి మెజార్టీ, ప్రతి పక్షపార్టీలు ధరవత్తుల గల్లంతుపై, క్రాస్ ఓటింగ్‌పై కుడా పందేలు కాస్తునట్లు సమాచారం. కవితకు మంత్రి పదవి వస్తుందా లేక కొంతకాలం తర్వాత వస్తుందా అనే విషయమై పందేలు కాస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం.

Advertisement

Next Story