- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
టీడీపీ దొంగల పార్టీ.. ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఆగ్రహం
దిశ, ఏపీ బ్యూరో: టీడీపీ అధినేత చంద్రబాబు, రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడులపై వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ అంటే తెలుగు దొంగల పార్టీ అంటూ తీవ్ర విమర్శలు చేశారు. ఆ తెలుగు దొంగలపార్టీకి చంద్రబాబు, అచ్చెన్నాయుడులు అధ్యక్షులని సంచలన ఆరోపణలు చేశారు. ఈ నేతలకు హఠాత్తుగా ఉత్తరాంధ్ర అభివృద్ధి అంశం ఎందుకు గుర్తుకొచ్చిందో అర్థం కావడం లేదన్నారు. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసినా.. చంద్రబాబుకు ఏనాడూ ఉత్తరాంధ్ర అభివృద్ధి గుర్తుకు రాలేదని.. ప్రతిపక్షంలో ఉండగానే ఉత్తరాంధ్ర గుర్తుకు వచ్చిందా? అని నిలదీశారు. తాడేపల్లిలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన, దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలోనే ఉత్తరాంధ్ర అభివృద్ధి ప్రారంభమైందని చెప్పుకొచ్చారు.
ముఖ్యమంత్రి జగన్ తన పాదయాత్రలో ఉత్తరాంధ్ర ప్రజల సమస్యలను తెలుసుకున్నారని.. ముఖ్యంగా ఉద్దానం, కిడ్నీ సమస్యల గురించి పూర్తిగా అధ్యయనం చేశారని తెలిపారు. అందువల్లే సీఎం ఉద్దాన సమస్య పరిష్కారానికి రూ.750 కోట్లతో తాగునీటిని అందించేందుకు శ్రీకారం చుట్టబోతున్నారని చెప్పుకొచ్చారు. అలాగే ఉద్దానంలో కిడ్నీ డయాలసిస్ యూనిట్‌తో పాటు రీసెర్చ్ సెంటర్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. చంద్రబాబు 40 ఏళ్ల రాజకీయ జీవితంలో ఏనాడూ ఉత్తరాంధ్రను పట్టించుకోలేదు సరికదా తీరని అన్యాయం చేశారని ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌పై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ నోటికి ఎంతొస్తే అంత మాట్లాడుతున్నారని.. నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ వార్నింగ్ ఇచ్చారు.