- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
క్రీడలతోనే ఒత్తిడి దూరం: ఎమ్మెల్యే సధీర్‌రెడ్డి
దిశ, ఎల్బీనగర్: క్రీడలు మానసిక ఒత్తిడి దూరం చేస్తాయని ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి అన్నారు. శుక్రవారం బీఎన్ రెడ్డి నగర్ డివిజన్ పరిధిలోని వైదేహినగర్‌లో 'నైట్ టైయిన్' బ్యాడ్మింటన్ అకాడమిని స్థానిక కార్పొరేటర్ మొద్దు లచ్చిరెడ్డితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీఎన్ రెడ్డి నగర్‌లో బ్యాడ్మింటన్ అకాడమిని స్థాపించడం సంతోషంగా ఉందన్నారు. ఉరుకుల పరుగుల జీవితంలో కొంత సమయం క్రీడలకు కేటాయించడం వల్ల మానసికంగా ఎంతో ఉపయోగకరమన్నారు.
ఇలాంటి అకాడమీలు మరిన్ని ఏర్పాడాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో వైదేహి నగర్ కాలనీ అధ్యక్షులు దామోదర్ రెడ్డి, హరి హర పురం కాలనీ గౌరవ అధ్యక్షులు శంకరయ్య గౌడ్ , అర్బన్ జిల్లా కార్యవర్గ సభ్యులు నరసింహారెడ్డి, డివిజన్ ఉపాధ్యక్షులు మెట్టుపల్లి సంతోష్ రెడ్డి, విష్ణువర్ధన్ రెడ్డి, నాయకులు కిషోర్, పవన్ రెడ్డి, శ్రీధర్ రెడ్డి, బీజేవైఎం ఉపాధ్యక్షులు సురేష్ కుమార్ మరియు తదితరులు పాల్గొన్నారు.