- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సీఎం రిలీఫ్ ఫండ్ పేదలకు ఓ వరం: ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి
దిశ, ఎల్బీనగర్: ఆపదలో ఉన్న నిరుపేదలకు సీఎం సహాయ నిధి ఓ వరం లాంటిదని ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి అన్నారు. శుక్రవారం వనస్థలిపురం డివిజన్ సుష్మా సాయినగర్ కాలనీకి చెందిన గీత మోకాళ్ల నొప్పితో బాధపడుతూ ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స చేయించుకున్నారు. ఈ క్రమంలో ఆసుపత్రి బిల్లు ఎక్కువగా ఉండడంతో గీత కుటుంబసభ్యులు ఎమ్మెల్యేను కలిసి పరిస్థితిని వివరించారు.
వెంటనే స్పందించిన ఎమ్మెల్యే ముఖ్యమంత్రి సహాయనిధి నుండి రూ. 2. 50 లక్షలు మంజూరు చేయించి బాధితురాలి కుటుంబసభ్యులకు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. అధునాతన వైద్య సేవలు పొందేందుకు సీఎం రిలీఫ్ పండ్ ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో బీఎన్ రెడ్డి డివిజన్ టీఆర్ఎస్ అధ్యక్షులు కటికరెడ్డి అరవింద్‌రెడ్డి, ఖాజా, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.