ఆ భూములకు పట్టాలిప్పించే బాధ్యత నాది.. ఎమ్మెల్యే షకీల్ హామీ

by Shyam |
Bodhan MLA Shakeel
X

దిశ, నవీపేట్: తెలంగాణ రాష్ట్రం సాధిస్తోన్న అభివృద్ధిని చూసి బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు మెచ్చుకోవడాన్ని ఓర్వలేకనే రాష్ట్ర బీజేపీ నాయకులు రాద్ధాంతం చేస్తున్నారని బోధన్ ఎమ్మెల్యే షకీల్ విమర్శించారు. మండల కేంద్రంలో గురువారం కవితక్క-షకీలన్న యువసేనా కార్యాలయం, వాటర్ ప్లాంట్‌ను ఎమ్మెల్యే షకీల్ ప్రారంభించి, ప్రభుత్వ ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేశారు. అనంతరం ఫత్తేనగర్‌లో ఏర్పాటు చేసిన టీఆర్ఎస్ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కేసీఆర్ చేస్తోన్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు పొగుడుతున్నారని అన్నారు. అది విన్న తెలంగాణ బీజేపీ నేతలు ఓర్వలేక అనవసర రాద్ధాంతం చేస్తున్నారని మండిపడ్డారు. రైతుబంధు, రైతుబీమాకు నోచుకోకుండా ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఫత్తేనగర్ సైనిక భూములకు పట్టాలు ఇప్పించే బాధ్యత తనదేనని హామీ ఇచ్చారు.

గ్రామ సర్పంచ్ ఫాతిమా తాహేర్ 30 సమస్యలను విన్నవించగా పరిష్కారానికి కృషి చేస్తానని అన్నారు. కరోనా కారణంగా రాష్ట్రంలో బడ్జెట్ సమస్య ఏర్పడడంతో అభివృద్ధి పనులు చేయడంలో జాప్యం జరిగిందని, కార్యకర్తల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో ఎంపీపీ సంగెం శ్రీనివాస్, జెడ్పీటీసీ సవిత బుచ్చన్న, టీఆర్ఎస్ మండల అధ్యక్షులు మువ్వ నాగేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి ప్రవీణ్ కుమార్, వైస్ ఎంపీపీ ప్రవీణ్, సొసైటీ చైర్మన్లు మగ్గరి హన్మాండ్లు, అబ్బన్న, నాయకులు శ్రీనివాస్, పోశెట్టి, నర్సింగ్ రావు, సూరిబాబు, సుదర్శన్, సతీష్, ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు టీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed