- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
మేడారం జాతర పనులు త్వరగా పూర్తి చేయండి : సీతక్క
దిశ, ములుగు: మేడారం జాతర పనులు త్వరగా పూర్తి చేయాలని, జాతరకు వచ్చిన భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని ములుగు ఎమ్మెల్యే సీతక్క అధికారులు సూచించారు. సోమవారం జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో అధికారులతో ఎమ్మెల్యే సీతక్క సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ.. అభివృద్ధి పనులు గురించి సమీక్షించి, అభివృద్ధికి ఎటువంటి ఆటంకం కలుగకుండా చూడాలని సూచించారు. నియోజకవర్గ అభివృద్ధి కోసం పాటుపడాలని, ఈసారి మేడారం జాతరను విజయవంతంగా నిర్వహించాలని అన్నారు. ములుగు నియోజవర్గం మొత్తం అటవీ ప్రాంతం కావడంతో అందరూ కలిసికట్టుగా కృషి చేయాలని సూచించారు.
దేవాదుల పైపులైను ద్వారా జకారం ములుగులోకం చెరువు అబ్బాపూర్ చెరువులోకి నీళ్ళు అందించాలని వెల్లడించారు. పాకాలపై లిఫ్ట్ ఏర్పాటు చేసి ఏజెన్సీ మండలాలకు, ఆదివాసీ గ్రామాల రైతులకు సాగునీరు అందించాలని తెలిపారు. ఇటీవల జిల్లాలో కురుస్తున్న వర్షాలకు ప్రజలు భయబ్రాంతులకు గురవుతున్నారని, అధికారులు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కరకట్టల నిర్మాణ పనుల కోసం రూ. 137 కోట్లు మంజూరు అయినప్పటికీ పనులు ఎందుకు పూర్తి కాలేదని అధికారులు ప్రశ్నించారు. ఇప్పటికైనా పూర్తికానీ ముళ్లకట్ట పనులకు సంబంధించి సమీక్షలు నిర్వహించి, అభివృద్ధిపై దృష్టి సారించాలని అధికారులకు సూచించారు.