అభివృద్ధిపై ప్రతిపక్షాలకు ఎమ్మెల్యే సైదిరెడ్డి కౌంటర్

by Sridhar Babu |   ( Updated:2021-07-27 07:25:49.0  )
అభివృద్ధిపై ప్రతిపక్షాలకు ఎమ్మెల్యే సైదిరెడ్డి కౌంటర్
X

దిశ నేరేడుచర్ల: హుజూర్‌నగర్ నియోజకవర్గంలో జరుతున్న అభివృద్ధి పై ప్రతిపక్షాలు విమర్శలు చేయడం సరికాదని.. వీలైతే సలహాలు, సూచనలు ఇవ్వాలని ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి కౌంటర్ వేశారు. మంగళవారం మఠంపల్లి మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన నూతన రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో గిరిజన తండాలు అభివృద్ధి చెందుతున్నాయని చెప్పారు. గిరిజన తండాలను గ్రామ పంచాయతీలుగా మార్చిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందని కొనియాడారు.

Advertisement

Next Story