పవన్ కళ్యాణ్‌.. నీకు పార్టీ, జెండా ఎందుకు : రోజా

by Anukaran |
పవన్ కళ్యాణ్‌.. నీకు పార్టీ, జెండా ఎందుకు : రోజా
X

దిశ, వెబ్‌డెస్క్ : ఆంధ్రప్రదేశ్‌ ప్రజలకు ప్రతిపక్షాలతో పని లేదని తేలిపోయిందని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే రోజా అన్నారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పాలనకు తిరుగులేదని ప్రజలు మరోసారి నిరూపించారన్నారు. సోమవారం మీడియాతో మాట్లాడిన ఆమె.. పవన్ కళ్యాణ్‌‌పై నిప్పులు చెరిగారు. రాష్ట్రంలో దాడులు పెరిగాయని ఆయన చేసిన వ్యాఖ్యలు హాస్యాస్పదంగా ఉన్నాయన్నారు. ఎక్కడైనా దౌర్జన్యం జరిగినట్లు పవన్‌ కళ్యాణ్ ఫిర్యాదు చేశారా అని ప్రశ్నించారు. రాష్ట్రమంతా కలిపి 19 వార్డులు గెలిచిన పవన్‌కు విమర్శించే అర్హత ఉందా? అన్నారు. పవన్ కల్యాణ్‌ పూటకో పార్టీకి మద్దతు ఇచ్చి కార్యకర్తలను అవమానిస్తున్నారని, అందరికీ మద్దతిచ్చే వారికి పార్టీ ఎందుకు, జెండా ఎందుకు?’’ అని విమర్శించారు. అమరావతి పేరుతో చంద్రబాబు చేసిన దోపిడీకి ప్రజలు బుద్ధి చెప్పారని చురకలు అంటించారు.

Next Story

Most Viewed