- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
నా వ్యాఖ్యలు వక్రీకరించి వైరల్ చేశారు : రాపాక
దిశ, వెబ్ డెస్క్ :
జనసేన పై ఆ పార్టీ ఎమ్మెల్యే రాపాక చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీనిపై స్పందించిన ఆయన తన వ్యాఖ్యలను వక్రీకరించారని మండిపడ్డారు. అంతకుమందు ‘జనసేన పార్టీ గాలికి వెళ్లిపోయే పార్టీ’ అని రాపాక వరప్రసాద్ అన్నారు.దీనిపై విమర్శలు వెల్లువెత్తడంతో వెంటనే సవరించుకుని ‘జనసేన పార్టీ గాలికి వెళ్లిపోయే పార్టీ అన్నా.. కానీ, గాలి పార్టీ అని అనలేదని’ కావాలనే కొందరు తన వ్యాఖ్యలను వక్రీకరించారని పేర్కొన్నారు.
తాను ఎమ్మెల్యే అయినప్పటికీ అధికార పార్టీతో ఉంటే పనులు అవుతాయని, మొదట్లో తాను వైసీపీ టిక్కెట్ ఆశించినా.. ఫలితం దక్కలేదని ఆయన వెల్లడించారు. బొంతు రాజేశ్వరరావు వల్ల తనకు టిక్కెట్ రాలేదని చెప్పుకొచ్చారు. తనను జనసేన పార్టీ సస్పెండ్ చేసిందంటూ చాలా ఫేక్ న్యూస్ వస్తున్నాయని.. నిజమెంటో తెలుసుకుని తన రాజీనామా గురించి ఆలోచిస్తానని రాపాకా స్పష్టంచేశారు.