- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
చావు డప్పు కొట్టి కేంద్రం కళ్లు తెరిపిస్తాం: టీఆర్ఎస్ ఎమ్మెల్యే
దిశ, రఘునాథపల్లి: తెలంగాణ రైతాంగం పట్ల కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలను చావు డప్పుతో తిప్పికొట్టి కేంద్ర సర్కారు కళ్లు తెరిపించాలని స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజయ్య అన్నారు. ఆదివారం రఘునాథపల్లి మండల కేంద్రంలో ఆర్య వైశ్య భవన్ లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు.
వరి ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్ర ప్రభుత్వం తీరుకు నిరసనగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు ఈనెల 20న చావు డప్పు కొట్టి నిరసన తెలపాలని ఆయన పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా, రైతు వ్యతిరేక కార్యక్రమాలను ప్రజలకు వివరించాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. ఈ నిరసన కార్యక్రమానికి కార్యకర్తలు, నాయకులు పెద్ద ఎత్తున తరలిరావాలని ఆయన కోరారు. ఈ సమావేశంలో మండల పార్టీ అధ్యక్షులు వారాల రమేష్, స్థానిక జెడ్పీటీసీ సభ్యుడు బొల్లం అజయ్, కాంచనపల్లి పీఏసీఎస్ చైర్మన్ చీమలపాటి రవి, పార్టీ సీనియర్ నాయకులు నామాల బుచ్చయ్య, చేవెళ్లి సంపత్, గొరిగె రవి, మడ్లపల్లి సునీత, తాటికొండ వెంకటేష్ యాదవ్, శంకర్, రామ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.