- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
Cyber Crime: ట్రేడింగ్ పేరుతో ఘరానా మోసం.. ఏకంగా రూ.24 లక్షలకు కుచ్చుటోపీ

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలో సైబర్ నేరగాళ్లు (Cyber Criminals) విచ్చలవిడిగా ఆర్థిక నేరాలకు పాల్పడుతున్నారు. ప్రజల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని కొందరు అక్రమార్కులు సులువుగా డబ్బు సంపాదించేందుకు మోసాలకు తెగబడుతున్నారు. వాట్సాప్ (Whatsaap), ఫేస్‌బుక్ (Facebook), ఇన్‌స్టాగ్రామ్ (Instagram) అనే తేడా లేకుండా అన్ని సోషల్ మీడియా (Social Media) ప్లాట్‌ఫాంలలో ఫేక్ అకౌంట్లు క్రియేట్ చేసి నిలువునా దోచేస్తున్నారు. క్యూఆర్ కోడ్స్ (QR Codes), వెబ్ లింకు (Web Links)లతో అమాయకుల నుంచి అందినకాడికి దోచుకుంటున్నారు. కొరియర్ల పేరిట డిజిటల్ అరెస్టులు అంటూ బ్యాంక్ ఖాతాల్లోని డబ్బునంతా ఖాళీ చేస్తున్నారు. స్టాక్ మార్కెట్లు (Stock Markets), ట్రేడింగ్ (Trading)లో పెట్టుబడి పెడితే రెండింతలు లాభం వస్తుందని నమ్మించి ముంచేస్తున్నారు.
తాజాగా, సంగారెడ్డి (Bhadradri Kothagudem) జిల్లాలో సైబర్ నేరగాడు (Cyber Criminal) ఘరానా మోసానికి పాల్పడ్డారు. వివరాల్లోకి వెళితే.. పట్టణానికి చెందిన దుగ్గిరెడ్డికి సైబర్ నేరగాడు ఫోన్ చేశారు. తమ వద్ద ట్రేడింగ్ (Trading)లో పెట్టుబడి పెడితే.. అధిక లాభాలు వస్తాయని మాయ మాటలు చెప్పి నమ్మించాడు. మొదట లాభాలు చూపించిన సైబర్ నేరగాడిని గుడ్డిగా నమ్మిన దుగ్గిరెడ్డి తన అకౌంట్ నుంచి ఏకంగా రూ.24 లక్షలను అతడిని అకౌంట్‌కు ట్రాన్స్‌ఫర్ చేశాడు. దీంతో తాను మోసపోయానని గ్రహించిన బాధితుడు.. తనకు న్యాయం చేయాలంటూ సమీప పోలీస్ స్టేషన్‌ను ఆశ్రయించాడు.