మంత్రి జగదీశ్ రెడ్డికి కోమటిరెడ్డి సవాల్

by Sridhar Babu |   ( Updated:2021-10-03 10:39:44.0  )
KOMATIREDDY
X

దిశ, చండూర్: టీఆర్ఎస్ హయాంలో తన నియోజకవర్గంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. ఆదివారం చండూర్ లో ఆయన విలేకరుల మాట్లాడుతూ.. హుజురాబాద్ లో ఏ విధంగానైతే దళిత బంధు పథకాన్ని అమలు చేస్తున్నారో మునుగోడు నియోజకవర్గంలో కూడా అమలు చేస్తే తాను కూడా రాజీనామా చేస్తానని ఆయన అన్నారు. చండూర్ మున్సిపాలిటీ ఎన్నికల్లో తాను కష్టపడి గెలిపించిన కాంగ్రెస్ నాయకులను ప్రలోభాలకు గురి చేసి టీఆర్ఎస్ లోకి చేర్చుకోవడం సిగ్గుచేటన్నారు. దమ్ముంటే మునుగోడు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలని మంత్రి జగదీశ్ రెడ్డికి ఆయన సవాల్ విసిరారు. వచ్చే ఎన్నికల్లో మంత్రి జగదీశ్ రెడ్డిని సూర్యాపేటలో ఓడిస్తానని రాజగోపాల్ రెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ పల్లె కళ్యాణి, పల్లె వెంకన్న, దోటీ వెంకన్న యాదవ్, భూత రాజు వేణు, నర్సిరెడ్డి, సజ్జవుద్దీన్, పలువురు గ్రామ సర్పంచులు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.

Next Story

Most Viewed