- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
గొప్ప మనసు చాటుకున్న ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి
దిశ, జడ్చర్ల: మాజీ మంత్రి, జడ్చర్ల ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి తన దాతృత్వాన్ని మరోసారి చాటుకున్నారు. బాలానగర్ మండలం తిరుమలగిరి గ్రామంలో నిరుపేద మహిళ సొంతింటి కలను నిజం చేశారు. ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి తన సొంత డబ్బులతో నూతన ఇళ్లు నిర్మించి, శనివారం స్థానిక ప్రజా ప్రతినిధులతో కలిసి సుజాత చేత గృహప్రవేశం చేపించారు. అనంతరం ఈ సందర్భంగా ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి మాట్లాడుతూ.. కొందరు విపక్ష నాయకులు పనిగట్టుకొని టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని అభాసుపాలు చేయడానికి పూనుకున్నారని విమర్శించారు. ఇష్టానుసారం సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారని మండిపడ్డారు. ఇందులో భాగంగానే తిరుమలగిరి గ్రామానికి చెందిన సుజాత ఇల్లులేక బాత్రూంలో నివాసం ఉంటున్నారని, ఆమెను స్థానిక ఎమ్మెల్యే పట్టించుకోవడంలేదని ఇష్టానుసారం పోస్టులు పెట్టారని అన్నారు. సుజాతకు ఇళ్లులేని విషయం తన దృష్టికి గ్రామ సర్పంచ్ ఆరు నెలల క్రితమే తీసుకొచ్చారని, ఆమెకు ఇళ్లు కట్టిస్తామని హామీ ఇచ్చామని, అప్పటివరకు కిరాయి ఇంట్లో ఉండాల్సిందిగా సూచించానని తెలిపారు.
కానీ, కొందరు ప్రతిపక్ష నాయకులు పనిగట్టుకొని సుజాతకు మాయమాటలు చెప్పి, ఉద్దేశపూర్వకంగానే బాత్రూంలో నివాసం ఉండేలా చేశారని అని విమర్శించారు. ప్రతిపక్ష నాయకులు చేతనైతే పేదలకు సహాయం చేయాలి తప్ప పేదరికాన్ని అడ్డుపెట్టుకొని తమ స్వార్థ రాజకీయాల కోసం పేదలను ఇబ్బందులు పెట్టొద్దని సూచించారు. అలాగే కేజే గ్రామంలో మరో నిరుపేద మహిళ నాగమ్మకు సైతం సొంత ఇంటిని కట్టిస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. అంతేగాకుండా.. నాగమ్మ ఇంటి నిర్మాణానికి భూమిపూజ చేశారు. త్వరలోనే నాగమ్మతో కూడా గృహప్రవేశం చేపిస్తామని తెలిపారు.