రూ.2లక్షల ఆర్థిక సాయం చేసిన ఎమ్మెల్యే

by Anukaran |   ( Updated:2020-08-27 10:09:35.0  )
రూ.2లక్షల ఆర్థిక సాయం చేసిన ఎమ్మెల్యే
X

దిశ, ఏపీ బ్యూరో: సోషల్ మీడియా ద్వారా మహిళ దయనీయ పరిస్థితిని తెలుసుకున్న ఎమ్మెల్యే.. ఆమె ఇంటికి వెళ్లి రూ.2లక్షల ఆర్థిక సాయం చేశారు. ఈ సంఘటన విజయనగరం జిల్లాలో జరగ్గా వివరాలు ఇలా ఉన్నాయి. పార్వతీపురం బంగారమ్మ కాలనీవాసి గరుగుబిల్లి కృష్ణవేణి కొంతకాలంగా మెదడుకు సంబంధించిన వ్యాధితో బాధపడుతోంది. పేద కుటుంబం కావడంతో చికిత్స చేసేందుకు సరిపడా డబ్బులు లేవు. ఇదేక్రమంలో తన తల్లి చికిత్సకు ఎవరైన సాయం చేయాలని ఆమె కుమారుడు తేజ సోషల్ మీడియాలో విజ్ఞప్తి చేయగా… స్పందించిన స్థానిక ఎమ్మెల్యే అలంజోగి జోగారావు ఆ మహిళ ఇంటికెళ్లి రూ.2లక్షల ఆర్థిక సాయం చేశారు. శస్త్ర చికిత్సకు కావల్సిన మిగతా సొమ్మును ప్రభుత్వం ద్వారా అందేలా చూస్తానని ఆ కుటుంబానికి ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.

Advertisement

Next Story