ఆ పత్రికపై చర్యలు తీసుకోవాలి: హరిప్రియ

by Shyam |   ( Updated:2020-03-13 06:23:53.0  )
ఆ పత్రికపై చర్యలు తీసుకోవాలి: హరిప్రియ
X

తాము అక్రమాలకు పాల్పడితే మంత్రి కేటీఆర్ సీరియస్ అయ్యారని.. ఈ నెల 10న ఓ దినపత్రిక అసత్య ప్రచారం చేసిందంటూ ఇల్లందు ఎమ్మెల్యే హరిప్రియ అన్నారు. ఆ మరుసటి రోజే ఈ వార్త అవాస్తవం అంటూ తిరిగి ప్రచురించారని ఆమె తెలిపారు. అయితే, తన ప్రమేయం లేకుండా తనపైననే అసత్య ప్రచారం జరగడం బాధించిందన్నారు. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద హరిప్రియ దంపతులు మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా మొదటిసారిగా ఎమ్మెల్యే అయిన తన మీద ఇలా వార్తలు రాయడం మానసిక క్షోభకు గురిచేసిందని ఆవేదన వ్యక్తం చేశారు.
అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో ఈ అంశాన్ని స్పీకర్ దృష్టికి తీసుకెళ్లానని హరిప్రియ చెప్పారు. ప్రభుత్వం, ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఆ దినపత్రికపై చర్యలు తీసుకోవాలని ఆమె కోరారు. మళ్లీ ఇటువంటి అవాస్తవ వార్తలు రాస్తే ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెడుతానని హెచ్చరించారు. మీడియా రంగంపై గౌరవంతోనే ప్రస్తుతం ఎటువంటి కేసు పెట్టలేదని హరిప్రియ దంపతులు చెప్పుకొచ్చారు.

Tags: yellandu mla, haripriya, assembly, fake news, hyderabad

Advertisement

Next Story

Most Viewed