- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
జీలుగు విత్తనాల పంపిణీని ప్రారంభించిన ఎమ్మెల్యే షిండే
by Shyam |

X
దిశ, నిజామాబాద్ :
జీలుగు విత్తనాల పంపిణీని కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండల కేంద్రంలో జుక్కల్ ఎమ్మెల్యే హన్మంత్ షిండే ప్రారంభించారు. బిచ్కుంద సహకార సంఘం ఆధ్వర్యంలో రైతులకు సబ్సిడీ కింద జీలుగు విత్తనాల పంపిణీ ప్రక్రియను శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ ధర 30 కిలోల జీలుగు విత్తనాలు బస్తాకు రూ. 567రూపాయలకు కొనుగోలు చేయాలన్నారు. కావున అవసరమైన రైతులు జీలుగు విత్తనాలు తీసుకోవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేతో పాటు సహకార సంఘం అధ్యక్షులు బాలాజీ, ఎంపీపీ అశోక్ పటేల్, జడ్పీటీసీ భారతి, సర్పంచ్ శ్రీరేఖ , సీఈవో శ్రావణ్ కుమార్ వైస్ చైర్మన్ యాదవ్ రావు, వ్యవసాయ అధికారి పోచయ్య, ఆయా గ్రామాల సర్పంచ్ లు, ఎంపీటీసీలు సహకార సంఘ పాలకవర్గ సభ్యులు, రైతులు పాల్గొన్నారు.
Next Story