- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
ఎమ్మెల్యే గువ్వలకు ఎన్ని కష్టాలో… మరో వివాదంలో చిక్కుకున్న ఎమ్మెల్యే…

దిశ, అచ్చంపేట : రాష్ట్రంలో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, మంత్రుల పరిస్థితి కుడితిలో పడ్డ ఎలుకలాగా తయారైంది. గ్రామాలకు వచ్చిన ఎమ్మెల్యేలు, మంత్రులకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజలకు అందడంలేదని ప్రజలు నిరసన వ్యక్తం చేస్తున్న ఘటనలు చూస్తునే ఉన్నాం. అయితే అధికార పార్టీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు పరిస్థితి మరి ఘోరంగా ఉంది. తన నియోజవర్గంలో రోజుకో వివాదంలో చిక్కుకుంటున్నారు. తాజాగా నాగర్ కర్నూలు జిల్లా పదరా మండల కేంద్రంలో గల మద్దిమడుగు గ్రామంలో వెలిసిన శ్రీ పబ్బతి ఆంజనేయ స్వామి ఆలయంలో ఆదివారం ఎమ్మెల్యే గువ్వల బాలరాజు పూజలు చేశారు.
ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన శిలాఫలకంపై ఎమ్మెల్యే ముఖ చిత్రాన్ని ఏర్పాటు చేయడాన్ని నిరసిస్తూ బీజేపీ అచ్చంపేట శాఖ ఆధ్వర్యంలో ఆలయ ఈఓ కార్యాలయం ముందు సోమవారం ధర్నా నిర్వహంచారు. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి నాగరాజు మాట్లాడుతూ.. వెంటనే ఎమ్మెల్యే ముఖ చిత్రాన్ని శిలాఫలకంపై తొలగించాలని, హిందూ మనోభావాలను దెబ్బతీసే విధంగా వ్యవహరించిన సంబంధిత అధికారులను వెంటనే తొలగించాలని ఆయన డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే హైందవ సమాజానికి క్షమాపణ చెప్పాలని లేని ఎడల పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని తెలియజేశారు. కార్యక్రమంలో రామోజీ, శంకర్‌జీ, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.