- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అట్టడుగు నుంచి.. అత్యున్నత స్థాయికి కలాం
by Shyam |
X
దిశ, పటాన్‌చెరు: మాజీ రాష్ట్రపతి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా గురువారం పటాన్‌చెరు పట్టణంలోని అబ్దుల్ కలాం డిగ్రీ కళాశాల ఆవరణలో కలాం విగ్రహానికి ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ… మన జననం ఓ సాధారణమైనది కావచ్చు, కానీ మరణం మాత్రం ఒక చరిత్ర సృష్టించేదిగా ఉండాలన్న కలాం వ్యాఖ్యలను గుర్తు చేసుకున్నారు. అట్టడుగు కుటుంబం నుంచి వచ్చిన కలాం… దేశంలోని అత్యున్నత రాజ్యాంగ పదవి అయిన రాష్ట్రపతి కావడం ఆయన సామర్థ్యానికి నిలువుటద్దం అని అన్నారు. నేటి యువత కలాం ఆలోచన విధానాన్ని అవగతం చేసుకొని రాష్ట్రం, దేశం అభివృద్ధిలో కీలక భూమిక పోషించాలని కోరారు.
Advertisement
Next Story