- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అభివృద్ధికి ప్రతిపక్షాలు కలిసి వచ్చేనా..!
దిశ ప్రతినిధి, నిజామాబాద్ : నిజామాబాద్ నగరాభివృద్ధికి ప్రతిపక్షాలు కలిసి రావాలని టీఆర్ఎస్ఎమ్మెల్యే బిగాల గణేశ్‌గుప్తా ఇచ్చిన పిలుపు చర్చనీయాంశమైంది. తమ డివిజన్ల అభివృద్ధికి నిధులు కేటాయించడం లేదని ప్రతిపక్ష బీజేపీ కార్పొరేటర్లు టీఆర్ఎస్పై దుమ్మెత్తి పోశారు. దానికి తోడు మేయర్ భర్త కనుసన్నల్లో నగర శివారులో ప్రభుత్వ భూముల్లో జరుగుతున్న ఆక్రమణపై బీజేపీ చేసిన పోరాటం టీఆర్ఎస్ను నాయకులను ఉక్కిరి బిక్కిరి చేశాయి.
ఈ నేపథ్యంలో ఈ నెల 7న మేయర్లేకుండానే ఎమ్మెల్యే మున్సిపల్ కౌన్సిల్ సమావేశాన్ని నిర్వహించారని, అక్రమాలకు గణేశ్‌గుప్తా వత్తాసు పలుకుతున్నాడని బీజేపీ నేతలు స్వరం పెంచారు. దాంతో ఈ నెల 13న ఎమ్మెల్యే గుప్తా నగర పాలక సంస్థ కార్యాలయంలో ప్రతిపక్ష కార్పొరేటర్లతో సమావేశం నిర్వహించారు. నగర అభివృద్ధికి అందరూ కలిసి రావాలని పిలుపునిచ్చారు. అయితే ప్రతిపక్ష బీజేపీ కార్పొరేటర్లతో కలిసి పాలకవర్గం అభివృద్ధికి పాటుపడుతుందా లేక గతంలోలాగా వ్యవహరిస్తుందా అన్నది ప్రస్తుతం చర్చ జరుగుతోంది.
ఎక్కడ వేసిన గొంగలి అక్కడే..
నగర పాలక సంస్థ నూతన పాలకవర్గం ఏర్పడి ఏడాది పూర్తయినా అభివృద్ధి మాత్రం ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్న చందంగా ఉంది. నిజామాబాద్ నగర పాలక సంస్థగా ఏర్పడిన సమయంలోనే మున్సిపల్ కార్పొరేషన్ గా ఏర్పాటైన కరీంనగర్స్మార్ట్ సిటీ దిశగా అడుగులు వేస్తోంది. అయితే నిజామాబాద్ మాత్రం గ్రీన్ సిటీగానే అభివృద్ధి చెందేందుకు అపసోపాలు పడుతోందని, ఇప్పటి వరకు మాస్టర్ ప్లాన్ కు కూడా ఆమోదం పొందలేదని సమాచారం. నిజామాబాద్ అర్బన్ డెవలప్మెంట్ఆథారిటీ (నుడా) ఏర్పాటైనా నిధులు లేక కనీసం కార్యాలయం లేక చేష్టలుడిగిపోయింది. ఒకటి రెండు రోడ్లు తప్ప ఎలాంటి డెవలప్మెంట్జరగడం లేదని నగర ప్రజలు ఆరోపిస్తున్నారు.
బీజేపీ దూకుడుకు టీఆర్ఎస్ అడ్డుకట్ట
నిజామాబాద్ లో బీజేపీ దూకుడుకు అధికార పార్టీ అడ్డుకట్ట వేస్తోంది. బీజేపీ కార్పొరేటర్లు ప్రాతినిధ్యం వహిస్తున్న డివిజన్లలో అభివృద్ధి పనులకు కొర్రీలు విధిస్తూ వారిని తమ వైపు తిప్పుకోవాలని ఎమ్మెల్యే చూస్తున్నారని ఆ పార్టీ ఆరోపిస్తోంది. టీయూఎఫ్ ఐడీసీ నిధులతో చేపట్టిన అభివృద్ధి పనులు అధికార, మిత్రపక్ష మజ్లిస్కార్పొరేటర్లు, ఇటీవల టీఆర్ఎస్లో చేరిన బీజేపీ కార్పొరేటర్లు ఉన్న డివిజన్లలో మాత్రమే చేపడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
పట్టణ ప్రగతి పనుల్లో భాగంగా ప్రతి డివిజన్ లో రూ.10 లక్షల పనులు చేపట్టాలని కౌన్సిల్ లో ఆమోదం జరిగినా, టెండర్లు జరగడం లేదని, ఒక వేళ టెండర్లు జరిగినా కాంట్రాక్టర్లకు పనులు ఇవ్వడంలేదని కమలం పార్టీ కార్పొరేటర్లు ఆరోపిస్తున్నారు. ఆర్అండ్బీ అభివృద్ధి పనుల విషయంలో వివక్ష ఉందని, కనీసం విద్యుత్‌దీపాల ఏర్పాటులోనూ అధికార పార్టీ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తుందని వాపోతున్నారు. ఈ నేపథ్యంలోనే ఎమ్మెల్యే గణేశ్‌గుప్తా నగరాభివృద్ధి కలిసి పనిచేద్దామని పిలుపునిచ్చారు. కానీ, అది ఆచరణ సాధ్యమవుతుందా..లేక ఎప్పటిలాగా ప్రతిపక్ష కార్పొరేటర్లపై వివక్ష కొనసాగుతందా అనేది వేచి చూడాలి మరి.