సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ

by Shyam |
సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ
X

దిశ, నారాయణఖేడ్:
ఆపదలో ఉన్న రోగులకు అత్యవసర పరిస్థితుల్లో చికిత్స కోసం సీఎం సహాయనిధి చెక్కులు ఎంతగానో ఉపయోగపడతాయని నారాయణఖేడ్ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి అన్నారు. సంగారెడ్డి జిల్లా కల్హేర్ మండలం ఖానాపూర్ (కే) లో ఎమ్మెల్యే నివాసంలో శుక్రవారం సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు. నాగధర్ గ్రామానికి చెందిన హనుమయ్య, పోచమ్మ.. కాల్వాణి కుంట తండాకు చెందిన వి. చందర్ కు చెక్కులను పంపిణీ చేశారు. ఈ పంపిణీ కార్యక్రమంలో కల్హేర్ జెడ్పీటీసీ నరసింహారెడ్డి, సర్పంచ్ కిష్టారెడ్డి, టీఆర్ఎస్ నేతలు వెంకటేశం, పండరి, సంగారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story