ఆత్మహత్యల కుట్ర.. ఈటలపై టీఆర్ఎస్ నేత సెన్సేషనల్ కామెంట్స్

by Anukaran |   ( Updated:2021-10-20 03:30:35.0  )
ఆత్మహత్యల కుట్ర.. ఈటలపై టీఆర్ఎస్ నేత సెన్సేషనల్ కామెంట్స్
X

దిశ, హుజురాబాద్: ఎలాగైనా గెలుపొందాలనే కుట్రలో భాగంగా ఈటల ఆత్మహత్యల పర్వానికి తెరలేపే ప్రమాదముందని ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజు ఆరోపించారు. బుధవారం కరీంనగర్ జిల్లా హుజురాబాద్ లో మీడియాతో మాట్లాడుతూ… వృద్ధులు, వ్యాధిగ్రస్తులకు డబ్బులు ఎర వేసి ఈటలను గెలిపించాలని లేఖ రాయించి ఆత్మహత్యలకు పురికొల్పే ప్రమాదముందని సూచించారు. ప్రజల జీవితాలతో చెలగాటం ఆడటానికి బీజేపీ అభ్యర్థి ఈటల వెనుకాడరని, నియోజకవర్గ ఓటర్లు అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు. ఉప ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు కుమ్మక్కయ్యాయని విమర్శించారు.

ప్రభుత్వ విప్ బాల్క సుమన్ మాట్లాడుతూ… బీజేపీ నేత ప్రేమేందర్ రెడ్డి ఎన్నికల సంఘానికి లేఖ రాసి దళితబంధును నిలిపివేయించి ఆ నెపాన్ని టీఆర్ఎస్ పై నెట్టడం జుగుప్సాకరమన్నారు. బీజేపీ నాయకుల నటనకు ఊసరవెల్లి కూడా సిగ్గుపడుతుందన్నారు. చైతన్యవంతులైన హుజురాబాద్ ఓటర్లు సినిమా యాక్టర్లను మించి నటిస్తున్న బీజేపీ అభ్యర్థికి తగిన గుణపాఠం చెప్పేందుకు టీఆర్ఎస్ కు ఓటు వేసి గెల్లు శ్రీనివాస్ ను భారీ మెజార్టీతో గెలిపిస్తారని ధీమా వ్యక్తం చేశారు.

Advertisement

Next Story