- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
చెక్‌డ్యామ్ వద్దే బువ్వ తిన్న ఎమ్మెల్యే.. సంతోషంలో జనాలు

దిశ ప్రతినిధి, మహబూబ్‌నగర్: కొత్తగా కట్టిన చెక్‌డ్యామ్ నిండి అలుగు పారుతుంటే ఆ ఆనందంలో గంటల తరబడి అక్కడే ఉండి.. బువ్వ తిని ఆనందించారు దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి. చిన్నచింతకుంట మండలం ఎద్దుల పూర్ గ్రామం వద్ద పూల చెట్టు వాగుపై 9 లక్షల 67 వేల రూపాయలతో నిర్మించిన చెక్‌డ్యామ్ గత రెండు మూడు రోజులుగా కురుస్తున్న వానలతో నిండి అలుగు పారింది. ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి జనంతో కలిసి ఆనందంగా కెప్టెన్‌కు పూజలు చేశారు. అక్కడే జనంతో గంటల తరబడి గడిపారు. మధ్యాహ్నం ఆ నీళ్ల అంచులో ఉన్న రాయి పై కూర్చొని భోజనం చేశారు. తమ గ్రామ సమీపంలో నీళ్ళు నిల్వ ఉండడం, భూగర్భ జలాల మట్టం పెరగడం వల్ల తమ పొలాలకు అవసరమైనన్ని నీళ్లు అందుతాయని గ్రామస్తులు, రైతులు సంతోషం వ్యక్తం చేశారు. ఇది ఇలా ఉంటే చెక్‌డ్యామ్ వద్దే ఎమ్మెల్యే భోజనం చేసిన చిత్రాలు నియోజకవర్గంలో తెగ వైరల్ అవుతున్నాయి.