ఊరు పేరు అడిగి రూ.19.21లక్షల పెన్షన్ సొమ్మును కాజేశారు

by srinivas |
ఊరు పేరు అడిగి రూ.19.21లక్షల పెన్షన్ సొమ్మును కాజేశారు
X

దిశ,వెబ్‌డెస్క్:గుంటూరు జిల్లాలో దారుణం జరిగింది. క్రికెట్ బ్యాట్ తో తలలు పగలగొట్టి పెన్షన్ సొమ్మును దోచుకున్నారు దుండగులు.శివపార్వతి,వాలంటీర్ బీరవల్లి వెంకటరెడ్డిలు పిడుగురాళ్ల మండలం జూలకల్లు గ్రామ సచివాలయంలో పనిచేస్తున్నారు. అయితే గ్రామస్తులకు పెన్షన్ పంపిణీ చేసేందుకు శివపార్వతి, బీరవల్లి వెంకటరెడ్డిలు పిడుగురాళ్ల ఎస్బీఐ బ్యాంక్ లో రూ. 19.21 లక్షల్ని డ్రా చేశారు. అనంతరం తిరుగు ప్రయాణంలో జానపాడు-పందింటివారిపాలెం గ్రామాల మధ్య గుర్తు తెలియని దుండగులు బాధితుల్ని అడ్డగించారు. మీది ఏ ఊరు అని ప్రశ్నించి, దుండగులు తమవెంట తెచ్చుకున్న క్రికెట్ బ్యాట్ తో దాడిచేశారు. అనంతరం పెన్షన్ సొమ్ము రూ.19.21లక్షల్నిదోచుకొని అక్కడి నుంచి పరారయ్యారు. దుండగుల దాడిలో తీవ్రగాయాలపాలైన బాధితుల్ని స్థానికులు అత్యవసర చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

Advertisement

Next Story