ఆస్పత్రి పనులను పరిశీలించిన మంత్రులు

by Shyam |
ఆస్పత్రి పనులను పరిశీలించిన మంత్రులు
X

దిశ, హైదరాబాద్‌: అమిర్‌పేటలోని 6 పడకల ప్రభుత్వ ఆస్పత్రిని.. 50 పడకలుగా అప్‌గ్రేడ్ చేస్తున్నారు. రూ. 2.58 కోట్ల రూపాయలతో దీనికి శ్రీకారం చుట్టారు. ఈ నేపథ్యంలోనే కొనసాగుతున్న పనుల పురోభివృద్ధిని మంత్రులు ఈటల రాజేందర్, తలసాని శ్రీనివాస్ యాదవ్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఈటల మాట్లాడుతూ.. ఏప్రిల్ 15 వరకు హాస్పిటల్‌ ప్రారంభిస్తామన్నారు. ప్రస్తుతానికి రెండు అంతస్థుల్లో ఆస్పత్రిని నిర్మిస్తున్నామని.. అవసరమైతే మరో 3 అంతస్థుల్లో కూడా నిర్మాణం చేపడుతామని ఈటల రాజేందర్ స్పష్టం చేశారు.

Tags: etala rajendar, talasani, hospital, upgrade, ameerpet

Advertisement

Next Story