లాక్‌డౌన్‌ను క‌ట్టుదిట్టంగా అమ‌లు : మంత్రి జగదీశ్ రెడ్డి

by Shyam |
లాక్‌డౌన్‌ను క‌ట్టుదిట్టంగా అమ‌లు : మంత్రి జగదీశ్ రెడ్డి
X

దిశ, న‌ల్ల‌గొండ‌: లాక్‌డౌన్‌ను మరింత కట్టుదిట్టంగా అమలు పరచాలని మంత్రి గుంటకండ్ల జగదీష్‌రెడ్డి నల్గొండ జిల్లా అధికారులను ఆదేశించారు. బుధవారం మధ్యాహ్నం నల్గొండ జిల్లా కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో జరిగిన ప్రత్యేక సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఉమ్మడి జిల్లాలోని ముఖ్యమైన కేంద్రాలలో డిస్ ఇన్ఫెక్షన్ టన్నెల్ ఏర్పాటు చేయాలని అధికారులను ఆయన ఆదేశించారు. ప్రధానంగా కరోనా వైరస్ సోకిందని అనుమానిస్తున్న వారిని తరలించే క్యారెంటైన్ కేంద్రాల్లో డిస్ ఇన్ఫెక్షన్ టన్నెల్ ఏర్పాట్లు తప్పని సరి అని ఆయన సూచించారు. అదే విధంగా కరోనా వైరస్ సోకిందన్న అనుమానంతో క్యారెంటైన్‌లో చేరి చికిత్సలు పొందుతున్న వారిలో ఆత్మవిశ్వాసం పెంపొందించేందుకు చర్యలు చేపట్టాలన్నారు. సామాజిక దూరం పాటించడంలోనూ ఆంక్షలు పాటించేలా చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ అధ్యక్షతన జరిగిన ఈ అత్యవసర సమీక్షా సమావేశంలో నల్గొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి, ఎస్పీ వి.రంగనాధ్, మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్, మాజీ ఎమ్మెల్సీ రంగనాధ్ తదితరులు పాల్గొన్నారు.

Tags: minister jagadish reddy, review meeting, officials, nalgonda, corona

Next Story

Most Viewed