- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వ్యాక్సిన్‌పై అపోహలు వద్దు : తలసాని
దిశ ప్రతినిధి, హైదరాబాద్: ప్రపంచ దేశాలకు కరోనా వ్యాక్సిన్ సరఫరా చేయడంలో హైదరాబాద్ ప్రధాన భూమికగా నిలుస్తుందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ఈ మేరకు సోమవారం హైదరాబాద్ జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో కరోనా వ్యాక్సిన్‌పై సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో పాల్గొన్న మంత్రి మాట్లాడుతూ… వ్యాక్సిన్‌పై ఎలాంటి అపోహలు, వదంతులు నమ్మరాదని సూచించారు. కరోనా వ్యాక్సిన్‌పై పూర్తి స్థాయిలో అవగాహన కలిగి ఉండాలని అన్నారు. వ్యాక్సిన్ వేయించుకునేందుకు వచ్చే వారికి అన్ని సదుపాయాలు కల్పించాలని సూచించారు.
వ్యాక్సిన్ తీసుకునే సమయంలో అవసరమైన ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని, త్వరలోనే దీనిపై అందరికీ సదాభిప్రాయం ఏర్పడుతుందని చెప్పారు. ప్రజలకు దీనిపై అవగాహన కల్పించేందుకు, భయాన్ని పోగొట్టేందుకు ప్రతిరోజూ వ్యాక్సిన్‌పై అందరికీ అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు. అనంతరం హోం శాఖ మంత్రి మహమూద్ అలీ మాట్లాడుతూ… కరోనా సమయంలో వైద్య ఆరోగ్య సిబ్బంది, పోలీసులు ఎంతో రిస్క్ తీసుకుని సేవ చేశారని అన్నారు. పోలీసులకు కూడా కరోనా వ్యాక్సిన్ అందించాలని అధికారులకు సూచించారు. ఈ సమీక్షలో హైదరాబాద్ జిల్లా కలెక్టర్ శ్వేతా మహంతి, జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేష్ కుమార్, నగర పోలీస్ కమిషనర్ అంజనీకుమార్, తదితర అధికారులు పాల్గొన్నారు.