వారిని ప్రభుత్వం ఆదుకుంటుంది

by Shyam |
వారిని ప్రభుత్వం ఆదుకుంటుంది
X

దిశ ప్రతినిధి , హైదరాబాద్: ఇటీవల నగరంలో కురిసిన భారీ వర్షాలతో నష్టపోయిన ప్రజలను ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రకటించారు. నాంపల్లి నియోజకవర్గ పరిధిలోని ఆండాలమ్మ బస్తీ, లక్ష్మీదాస్ వాడల్లో వర్షాలతో ముంపునకు గురైన సుమారు 100 కుటుంబాలకు ఎమ్మెల్యే జాఫర్ హు స్సేన్, ఎమ్మెల్సీ ప్రభాకర్ లతో కలిసి దుప్పట్లు, నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ…పెద్ద ఎత్తున వర్షాలు కురవడంతో నగరంలోని అనేక ప్రాంతాలు ముంపునకు గురయ్యాయని అన్నారు. ప్రజలు ఇబ్బందులు పడకుండా వెంటనే సహాయక చర్యలను ప్రభుత్వం చేపట్టిందని వివరించారు. భవిష్యత్ లో ఇలాంటి పరిస్థితులు ఏర్పడకుండా తగు ప్రణాళికలతో సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటుందని తెలిపారు. మరో రెండు రోజులపాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు.

Advertisement

Next Story