వారికి పూర్తి సహకారం అందిస్తాం : తలసాని

by Shyam |
వారికి పూర్తి సహకారం అందిస్తాం : తలసాని
X

దిశ, వెబ్‌డెస్క్: జంతు సంరక్షణకు ముందుకొచ్చే సంస్థలకు ప్రభుత్వం తరపున పూర్తి సహకారం అందిస్తామని పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ప్రపంచ రాబిస్ డే సందర్భంగా వీధి శునకాలకు వ్యాధినిరోధక టీకాలు పంపిణీ పోస్టర్‌ను మంత్రి తలసాని సోమవారం ఆవిష్కరించారు. అనంతరం ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… రాష్ట్రంలోని అన్ని రకాల జీవాలకు, అన్ని రకాల వైద్య సేవలు అందిస్తున్నామన్నారు. ఎనిమల్ బోర్డు ఆధ్వర్యంలో జంతు సంరక్షణ కోసం అనేక కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు.

Next Story

Most Viewed