- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
Selvaraghavan: ఆ ఇద్దరు స్టార్ హీరోలతో ‘యుగానికి ఒక్కడు’ సీక్వెల్.. హైప్ పెంచేస్తున్న డైరెక్టర్ కామెంట్స్

దిశ, సినిమా: తమిళ స్టార్ హీరో కార్తీ (Karti) నటించిన ‘ఆయిరత్తిల్ ఒరువన్’ (AayirathilOruvan) సినిమా ఎలాంటి హిట్ అందుకుందో అందరికి తెలిసిందే. రీమా సేన్, ఆండ్రియా, ఆర్. పార్థిబన్ తదితరులు ప్రధాన పాత్రల్లో నటించిన ఈ మూవీకి సెల్వరాఘవన్ దర్శకత్వం వహించాడు. 2010లో వచ్చిన ఈ తమిళ మూవీ తెలుగులో ‘యుగానికి ఒక్కడు’ (Yuganiki Okkadu) అనే పేరుతో డబ్ చేయబడింది. ఇక ఈ సినిమాకు సంబంధించిన సీక్వెల్ (sequel) కూడా ప్లాన్ చేశారు మేకర్స్. ‘ఆయిరత్తిల్ ఒరువన్-2’ (AO2) అనౌన్స్‌మెంట్ పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. కానీ ఇందులో హీరోగా కార్తీని కాకుండా ధనుష్‌ను తీసుకున్నారు. అయితే.. ఈ మూవీ నుంచి అనౌన్స్‌మెంట్ అయితే వచ్చింది కానీ ఇప్పటి వరకు ఎలాంటి అప్‌డేట్ రాలేదు.
ఈ క్రమంలోనే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న డైరెక్టర్ సెల్వరాఘవన్ (Selvaraghavan) పార్ట్ -2పై క్తారిటీ ఇచ్చాడు. ‘యుగానికి ఒక్కడు సీక్వెల్ అనౌన్స్ చేసి తప్పుచేశాను. నిజానికి ఆ సినిమాపై ఉన్న బజ్‌తో పార్ట్ 2 అనౌన్స్ చేశాము కానీ, ఆ తర్వాత దాని ఎఫెక్ట్ తెలిసిందే. ప్రకటించినప్పటి నుంచి దీనిపై అప్‌డేట్స్ అడుగుతూనే ఉన్నారు మూవీ లవర్స్. అయితే.. పార్ట్-2లో హీరోగా ధనుష్‌ను ప్రకటించాము. కానీ.. కార్తీ లేకుండా యుగానికి ఒక్కడు సినిమాను అసలు ఊహించుకోలేను. కాబట్టి పార్ట్-2లో ధనుష్(Dhanush)తో పాటు కార్తీ కూడా నటించనున్నారు.ఈ సినిమా కోసం వారిద్దరూ ఒక సంవత్సరం పాటు అవసరం. అలాగే ఈ మూవీని నిర్మించడానికి ఒక పెద్ద కంపెనీ ముందుకు వస్తే, ఈ సినిమా ఖచ్చితంగా జరుగుతుంది’ అంటూ చెప్పుకొచ్చాడు.