- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నిరాడంబరంగా బోనాలు: తలసాని
దిశ, హైదరాబాద్: కరోనా వ్యాప్తి కారణంగా బోనాలను నిరాడంబరంగా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు బుధవారం డాక్టర్ మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కార్యాలయంలో మంత్రులు తలసాని, మహమూద్ ఆలీ, మల్లారెడ్డి, మేయర్ బొంతు రామ్మోహన్.. గోల్కొండ, కార్వాన్, ఉజ్జయిని, అంబర్ పేట్ దేవాలయాల కమిటీలతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా మంత్రి తలసాని మాట్లాడుతూ.. ఈ నెల 25 నుంచి నగరంలో ప్రారంభం కానున్న ఆషాఢ బోనాల ఉత్సవాలను ప్రజలు ఎవరి ఇళ్లలో వారే జరుపుకోవాలని సూచించారు. ఆలయాల్లో పురోహితులే ఘట్టాలను ఊరేగింపు జరిపి అమ్మవారికి సమర్పిస్తారన్నారు. మహంకాళీ జాతర ఉత్సవాలతోపాటు ఇతర ప్రధాన ఆలయాలలో కూడా అక్కడి పురోహితులే చేపడతారని మంత్రి వెల్లడించారు. ఈ సమీక్షలో ఎమ్మెల్యేలు రాజాసింగ్, దానం నాగేందర్, మాగంటి గోపినాథ్, ముఠా గోపాల్, కాలేరు వెంకటేష్, సుభాష్ రెడ్డి, ఎమ్మెల్సీలు నాయిని నర్సింహారెడ్డి, ప్రభాకర్, ఎగ్గే మల్లేశం, కలెక్టర్ శ్వేత మహంతి, జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేష్ కుమార్, దేవాదాయ శాఖ కమిషనర్ అనిల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.